కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియాగాంధీ
చెనయ్: ఐక్య ప్రగతి కూటమి(యుపిఎ) చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం చెన్నైలోని డిఎంకె ప్రధాన కార్యాలయం ఆవరణ ‘అన్నా అరివాలయం’లో అన్నాదురై, డిఎంకె అధ్యక్షుడు ఎం. కరుణానిధి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘రాజ్యాంగ విలువలను కాలరాయడానికి బిజెపి కృతనిశయంతో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించేందుకు తమ పార్టీ డిఎంకెతో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంది’ అన్నారు. డిఎంకె నేత ఎం కరుణానిధిని ఆమె అనేక విధాల ప్రశంసించారు. ‘కరుణానిధి ఓ ప్రజాస్వామ్యవాది. ఆయనకు పార్లమెంటరీ సంస్థల్లో నమ్మకం ఉంది. 1971 నుంచి 1980 వరకు ఇందిరాగాంధీకి… బ్యాంకులను జాతీయీకరణ చేయడంలో ఆయన ఇచ్చిన మద్దతు ఎల్లప్పుడూ గుర్తించుకుంటాం’ అన్నారు. ‘కాంగ్రె స్, డిఎంకె ఐక్యత సందేశం ప్రజల్లోకి వెళ్లాలి’ అని చె ప్పా రు. ‘ఆయన జ్ఞానం, అనుభవం తాము సంకీర్ణ ప్రభు త్వం నడిపినప్పుడు మార్గదర్శకంగా పనిచేశాయి’ అని తెలిపారు. ప్రజలకు చేసిన సేవ, సాహిత్యంపట్ల ఆయనకు ఉ న్న ఆసక్తి, తమిళ బాషపట్ల ఆయనకున్న మక్కువ, ఆయన వాగ్దాటిని సోనియా ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రతిపక్ష ఐక్యతను చాటే ఈ వేడుకకు ఎపి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేరళ సిఎం పినరయి విజయన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణసామి సహా వివిధ పార్టీల రాజకీయ నాయకులు విగ్రహావిష్కరణ, తదనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. వీరే కాకుండా కరుణానిధి మేనల్లుడు దయానిధి మారన్, స్టాలిన్, కనిమొళి, రాజకీయంలోకి వచ్చిన నటులు శతృఘ్న సిన్హా, రజనీకాంత్, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్, ఎండిఎంకె ప్రధాన కార్యదర్శి వైకో హాజరయ్యారు.
తమిళ ఆచారాలు, సంస్కృతిపై బిజెపి దాడిచేస్తోంది: రాహుల్
కరుణానిధి విగ్రహావిష్కరణ వేడుక త ర్వాత ర్యాలీలో ఈ రాహుల్ గాంధీ ప్ర సంగిస్తూ ‘కరుణానిధి మామూలు రాజకీయ నాయకుడు కాదు. ప్రతి వ్యక్తిలో రెండు రకాలైన శక్తులు ఉంటాయి. రాజకీయాల్లో కొందరు తమ గొంతుకతో విశేష ఆదరణ పొందుతారు. కరుణానిధి చాలా నిరాడంబరంగా జీవితం గడిపారు’అని కొనియాడారు. తమిళ ప్రజల ఆచారాలు, సంస్కృ తి, సంస్థలపై బిజె పి దాడి చేస్తోంది, కోట్లాది ప్రజల గొ ంతును కూడా బిజెపి ప్రభుత్వం నొక్కివేస్తోందని రాహుల్ ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను బిజెపి నాశనం చేస్తుంటే తాము సహించబోమని స్పష్టం చేశారు.
ప్రధాని అభ్యర్థి రాహులే: స్టాలిన్
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ‘ఫా సిస్టు’ నరేంద్ర మోడీ ప్రభుతాన్ని ఓడించే శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ అధ్యక్షుడు రా హుల్ గాం ధీకి ఉన్నా యని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రధాని అ భ్యర్థి రాహుల్ గాంధీయేనని డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అ న్నారు. మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. 1980లో కరుణా నిధి, ఇందిరాగాంధీకి ఇచ్చిన మద్దతును స్టాలిన్ ప్రస్తావించారు.