HomeNewsBreaking Newsరాజ్యాంగ రక్షణకు ఐక్యమవ్వాలి

రాజ్యాంగ రక్షణకు ఐక్యమవ్వాలి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోని బిజెపి పదేళ్ల పాలనలో దళితులు, పేదల హక్కులు కాలరాయడంతో పాటు దేశ ప్రజలందరి గుండెకాయగా ఉన్న భార త రాజ్యాంగ రద్దుకు ప్రయత్నిస్తోందని ఆలిండి యా దళిత్‌ రైట్‌ మూవ్‌మెంట్‌ (ఎఐడిఆర్‌ఎం) ప్రధాన కార్యదర్శి నిర్మల్‌ విమర్శించారు. మధ్యయుగాల కాలంనాటి మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి రాజకీయాలకతీతంగా అంద రూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. బిజెపి పాలనలో దళితులకు ఏమాత్రం రక్షణ లేదని, దాడులు దౌర్జన్యాలు మునుపెన్నడు లేనివిధంగా 300 రేట్లు పెరిగాయని, దళితుల సమస్యలపై జాతీయస్థాయి ఉద్యమానికి సన్నద్ధం కావాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పిలుపునిచ్చారు. హిమాయ త్‌ నగర్‌లోని మఖ్దూంభవన్‌లో కుల వివక్ష వ్యతిరే క పోరాట సంఘం (కెవిపిఎస్‌), దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్‌పిఎస్‌) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (జవహర్‌ నగర్‌), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (అమృత ఎస్టే ట్‌) సంఘాల సంయుక్త సమావేశం బికెఎంయు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎన్‌.బాల మల్లేష్‌ అధ్యక్షతన సోమవారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మల్‌, బి.వెంకట్‌ మాట్లాడుతూ బిజెపి అధికారంలో వచ్చినప్పటి నుండి రాజ్యాంగ హక్కులు రద్దు కాబడుతున్నాయని, రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీని ప్రభుత్వం చింపుతోందని, దేశ ప్రజలందరికీ దిశా నిర్దేశం చేయగలిగిన రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుస్కృతి ని ప్రవేశపెట్టి, మత రాజ్యాన్ని స్థాపించాలని చూ స్తోందని, దీనిని నేటితరం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నడిరోడ్డులో అమ్ముతూ, రిజర్వేషన్లు లేకుండా చేసి రాజ్యాంగంలో మూల స్తంభంలాంటి సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుందన్నారు. వాముపక్షాల ఒత్తిడితో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూలీలలో అత్యధికలు దళితులే ఉన్నారని, వారికి కేటాయించిన నిధులు క్రమేపి తగ్గిస్తూ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని వారు విమర్శించారు. బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో ఆదివాసి గిరిజన బిడ్డపై బిజెపి ఎంఎల్‌ఎ సహాయకుడు నడిరోడ్డుపై మూత్రం పోయడం చూస్తే దేశం ప్రస్తుతం ఎటు పోతుందనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ పోకడలు చూస్తే మనువాదానికి మత ఘర్షణలకు పేదల మధ్యలో వైశామ్యాలకు ఉద్దేశపూర్వకంగానే బిజెపి కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజాస్వామిక దేశంలో పౌరులు ప్రశ్నించడాన్ని స్వాగతించాల్సింది పోయి, అక్రమ కేసులు బనాయించటం సరికాదన్నారు. జాతీయ స్థాయిలో దళితుల హక్కుల కోసం ఒక కీలకమైన ఎజెండాను దళితుల ముందు ఉంచుతామని వారు చెప్పారు. ఈ సమావేశంలో కెవిపిఎస్‌ రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ టీ. స్కైలాబ్‌ బాబు ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట అధ్యక్షులు కె.కాంతయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, రాష్ర్ట నాయకులు ఆర్‌ . అంజనేయులు దళిత హక్కుల పోరాట సమితి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ కుమార్‌, రాష్ర్ట గౌరవ అధ్యక్షుడు యేసు రత్నం కెవిపిఎస్‌ రాష్ర్ట కమిటీ సభ్యులు ఎం కపాసాగర్‌ ఎన్‌ బాల పీరు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments