గవర్నర్ పర్యటనలకు వెళ్తే వెంట ఎస్‌పి, కలెక్టర్ రాకపోవడం అవమానించినట్టు కాదా?
నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రాజ్‌భవన్‌కు గౌరవమివ్వాలి
ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ తమిళిసై
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్ రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉందన్నారు. గవర్నర్ అంటే వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. “రాష్ట్రంలో నేను పర్యటనలకు వెళితే ఎస్‌పి, కలెక్టర్ రావడం లేదు” అని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు తాను ప్రధానిని కలవలేదని గవర్నర్ స్పష్టం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రధాని మోడీతో బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యా రు. గత కొంత కాలంగా రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య అంతరం పెరిగిందన్న వార్తలతో గవర్నర్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల విషయంలో చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధానిని కోరినట్లు తమిళిసై వివరించారు.
అది నా పని కాదు : “రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధానికి రిపోర్ట్ కార్డు ఇవ్వడం నా పని కాదు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ విషయాలు ఎవరితో చర్చించాల్సిన అవసరం లేదు’ – తమిళిసైకి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రాజ్‌భవన్‌కు గౌరవమివ్వాలి. గవర్నర్ పర్యటనలకు వెళ్తే వెంట ఎస్‌పి, కలెక్టర్ రాకపోవడం అవమానించినట్టు కాదా? అధికారుల వైఖరిపై నేను ఏ సమస్యను సృష్టించాలనుకోవడం లేదు. నేనేమి వివాదాస్పదం చేయలేదు. చర్చకు సిద్ధంగా ఉన్నాను” అని గవర్నర్ తమిలిసై అన్నారు. అధికారులను హాజరు కాకుండా ఆదేశాలు జారీ చేయడం, ప్రొటోకాల్ అమలు చేయకపోవడం సరైన చర్యేనా? ఈ తరహా ఉల్లంఘనలు సరైనవో కావో అన్నది తెలంగాణ ప్రజలకే వదిలివేస్తున్నానన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని, అది అందరికీ తెలిసిందేనన్నారు. ‘తాను వివాదాస్పద వ్యక్తిని కాదు. వివాదాలు కోరుకోవట్లేదు. అంటే దాని అర్థం ప్రభుత్వం నుంచి ఏ విజ్ఞప్తి వచ్చినా దానిని అంగీకరించాలని దాని అర్థం కాదు. రాష్ట్రంలో రాజ్యాంగానికి అధిపతిగా నకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. నేను ల్లప్పుడూ చట్టం, వ్యవస్థ ప్రకారం నడుచుకుంటా. ఒక వేళ నేను వ్యవస్త ప్రకారం నడుచుకుంటే , దానిని మరో విధంగా అర్ధం చేసుకుంటే, ప్రభుత్వం గవర్నర్‌ను అవమానించాలనుకుంటే, నేను అలాంటి వాటి గురించి పట్టించుకోను. గవర్నర్ కోటా ఎంఎల్‌సి నియామకంలో వివాదమేమీ లేదని, సేవారంగంలో ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తి సేవ చేయలేదని తాను భావించానని, తన అభిప్రాయాన్ని మాత్రమే ప్రభుత్వానికి చెప్పాను” అని గవర్నర్ అన్నారు.
అందుకే ప్రధానిని కలిశా : ఒక డాక్టర్‌గా దేశంలో భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పినట్లు గవర్నర్ తెలిపారు. పుదుచ్చేరి తెలంగాణ మధ్య అన్ని రకాల పర్యాటక అవకాశాలను పరిశీలించామని, వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఆమె వెల్లడించారు. అందుకోసం రెండు ప్రాంతాల మధ్య విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో ‘ట్రైబల్ టూర్’ పేరుతో తాను గిరిజన ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలు గురించి చర్చించామని చెప్పారు. రాష్ట్రంలో 11 శాతం గిరిజనలు ఉన్నారని, వారి ప్రగతికి కూడా చర్యలు తీసుకుంటామని గవర్నర్ తెలిపారు. రాజ్‌భవన్‌కు ఎవరైనా రావొచ్చు, సమస్యలు తన దృష్టికి తీసుకురావొచ్చని గవర్నర్ చెప్పారు. తనను ఎవరూ అవమానించలేదని, తనకు ఎలాంటి ఈగోలు లేవని, తాను ఫ్రెండ్లీ గవర్నర్‌నని గవర్నర్ తమిలిసై పునరుద్ఘాటించారు.
రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలి
RELATED ARTICLES