ప్రజాపక్షం/న్యూఢిల్లీ లౌకికవాదంపై మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ చేసిన వ్యాఖ్యలను సిపిఐ తీవ్రంగా ఖండించింది. గవర్నర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా వున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించింది. గవర్నర్ పదవీ స్వీకారం సందర్భంగా చేసిన ప్రమాణాన్ని కోషియారీ ఉల్లంఘించారని అభిప్రాయపడిం ది. కోషియారీ వ్యాఖ్య రాజ్యాంగానికి, రా జ్యాంగ పీఠికకు తీవ్ర అవమానమని పేర్కొంది. భారతదేశం సెక్యులరిజానికి కట్టుబడివుందని పీఠికలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. గవర్నర్ పదవికి కోషియారీ అనర్హుడని, తక్షణమే అతన్ని డిస్మిస్ చేయాలని రాష్ట్రపతికి సిపిఐ విజ్ఞప్తి చేసింది. బిజెపియేతర పాలిత రాష్ట్రాల్లో నియమితులైన గవర్నర్ల ప్రవర్తనాతీరు ఆందోళనకరంగా వుందని సిపిఐ వెల్లడించింది. రాజ్యాంగ సంస్థల అధినేతలు రాజ్యాంగాన్ని గౌరవించేలా చేయాలని రాష్ట్రపతిని కోరింది. కొవిడ్ ప్రభావం తగ్గినందున, మహారాష్ట్రలో దేవాలయాలకు అనుమతినివ్వాలని గవర్నర్ కోషియారీ ఒక లేఖలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కోరారు. ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని, ఇప్పుడే దేవాలయాల పునఃప్రారంభం సాధ్యం కాదని ఆ లేఖకు థాక్రే స్పందించారు. దీనిపై కోషియారీ ప్రతిస్పందిస్తూ, థాక్రే ఉన్నట్టుండి లౌకికవాది అయిపోయారంటూ వ్యాఖ్యానించారు. దీం తో థాక్రే మళ్లీ స్పందిస్తూ ‘నా హిందూత్వ’ గురించి గవర్నర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇలా ఇరువురి మధ్య మాటలయుద్ధం జరిగింది. ఈ సందర్భంలోనే కోషియారీ లౌకికవాదానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా వున్నాయని సిపిఐతోపాటు సిపిఐ(ఎం)లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి.
అసలు సమస్యలను తప్పుదారి పట్టించడమే
ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయడానికి పెట్టుబడుల కార్యకలాపాలను పెంచాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు ప్రకటించిన కొత్త ప్యాకేజీలో చెప్పుకోవడానికి ఏమీ లేదని, పైగా ప్రజలు, దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి చేసిన ప్రయత్నమని సిపిఐ విమర్శించింది. కొత్త ప్యాకేజీ అర్థరహితమైనదని సిపిఐ కార్యదర్శివర్గం వ్యాఖ్యానించింది.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ‘మహా’ గవర్నర్
RELATED ARTICLES