HomeNewsBreaking Newsరాజ్యాంగం, ప్రజాస్వామ్యప్రాథమిక స్ఫూర్తి ధ్వంసం

రాజ్యాంగం, ప్రజాస్వామ్యప్రాథమిక స్ఫూర్తి ధ్వంసం

భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తున్న బిజెపి
ప్రగతిశీల శక్తులే రాజ్యాంగాన్ని, ప్రజా స్వామ్యాన్ని రక్షించాలి
ఎఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా
ప్రజాపక్షం / హైదరాబాద్‌

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య ప్రాథమిక స్ఫూర్తిని బిజెపి ధ్వంసం చేస్తున్నదని, ప్రగతిశీల శక్తులే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌ పాషా పిలుపునిచ్చారు. యావత్‌ దేశానికే అత్యంత ప్రమాదకరమైన ప్రజాస్వామ్య నైతికతకు మోడీ ప్రభుత్వం కోలుకోలేని నష్టం కలిగించిందని అయన తెలిపారు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ లాంటి భారత రాజ్యాంగ సృష్టికర్తలను అగౌరవపరుస్తూ ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడం ద్వారా బిజెపి ప్రతి భారతీయుని మనోభావాలను దెబ్బతీసిందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి దుర్మార్గపు చర్యలను చూసి దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని అయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య
విజ్ఞాన కేంద్రంలో శనివారం మాజీ ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు బాలకృష్ణ, పందుల రాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ నేత ఉమా మహేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమ్మేళనానికి సయ్యద్‌ అజీజ్‌ పాషా ముఖ్యఅతిథిగా హాజరుకాగా, గతంలో ఎఐఎస్‌ఎఫ్‌లో పని చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌. బాల మల్లేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు , అప్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ డా. దిడ్డి సుధాకర్‌, సినీ దర్శకుడు బాబ్జి, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్‌, అన్వర్‌ పాషా, తిప్పర్తి యాదయ్యలు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఆగస్ట్‌ 12న ఏఐఎస్‌ఎఫ్‌ 88వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సందర్భంగా సయ్యిద్‌ అజీజ్‌ పాషా జెండా ఆవిష్కరణ చేసి ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాజకీయ అధికారం కోసం బిజెపి ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడం చేస్తుందని, దీనితో దేశంలో అసహనం, అశాంతి నెలకొన్నదని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ ధోరణిలతో ‘ప్రతీకార రాజకీయాలను‘ అవలంభిస్తూ అణిచివేత, మూక దాడులను, హింసను ప్రోత్సహిస్తుందని అయన మండిపడ్డారు. బీజేపీ ‘ఫాసిస్ట్‌” పాలనను అంతం చేయడానికి, భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ అనుకూల, లౌకిక మరియు ప్రజాస్వామ్య భారతదేశాన్ని విశ్వసించే ’ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్ర’ శక్తులందరు ఏకమై ‘భారతదేశ ఆత్మను‘ రక్షించుకోవాలని సయ్యిద్‌ అజీజ్‌ పాషా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఏఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకులు ఏం. ఆదిరెడ్డి, కెవిఎల్‌, పల్లా దేవేందర్‌ రెడ్డి , శ్రావణ్‌ కుమార్‌, సృజన్‌ కుమార్‌, ఆంజనేయులు, గుర్రం రాజశేఖర్‌ రెడ్డి, వాలి ఉల్లాహ్‌ ఖాద్రి, స్టాలిన్‌, శ్యాంసుందర్‌ రెడ్డి, కోటా పురుషోత్తం, ఝాన్సీ, పొదిల శ్రీనివాస్‌, పల్లె వెంకన్న, తిప్పర్తి మహేష్‌, జిల్లా యాదయ్య, చిత్రం సైదులు, గురం వెంక రెడ్డి, కట్ట వెంకటరెడ్డి లతోపాటు తెలంగాణ ఉమ్మడి జిల్లాల నుండి భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో, వృత్తులలో, పార్టీలలో కొనసాగుతున్న పూర్వ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు గత స్మృతులను నెమరు వేసుకుని..ప్రస్తుత పరిస్థితులు, ఉద్యమాలు, పూర్వ నాయకులుగా వామపక్ష భావజాలాన్ని పెంపొందించే దిశగా అడుగులు ముందుకు వేయాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌ లో ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ బలోపేతం కోసం తమ వంతుగా సహకారం అందించాలని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments