బెంగళూరు: ఐపిఎల్ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ప్లే ఆఫ్ స్థానం కోసం జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని జట్ల కు ప్రతి మ్యాచ్ కీలకంగా మారాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చెరో 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన రెండు స్థానల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రాయల్ ఛా లెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే ఈ రేసు నుంచి వైదొలిగింది. ఢిల్లీతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ సేన ఓటమిపాలై ప్లే ఆఫ్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఈ రేసులో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబా ద్, కింగ్స్‌లెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ముం బయి ఇండియన్స్ జట్లు ఉన్నాయి. ఈ జట్లు తమ తమ లీగ్ చివరి మ్యాచుల్లో ఖచ్చితంగా గెలిస్తేనే తర్వాతి స్టేజ్‌కు అర్హత పొందుతాయి. అందుకే ప్రతి జట్టుకు ఒకొక్క మ్యాచ్ కీలకంగా మారిం ది. ఈ క్రమంలోనే మంగళవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛా లెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన బెం గళూరు ఈ మ్యాచ్‌లో గెలిచిన పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ కు చెరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం 12 మ్యాచులు ఆడిన రాజస్థాన్ ఐదింట్లో గెలిచి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక మిగిలిన రెండు మ్యాచు ల్లో మంచి రన్‌రేట్‌తో నెగ్గితే రాజస్థాన్‌కు మరో అవకాశం ఉండే చాన్స్ ఉంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ మంచి ఫామ్‌లో ఉంది. ఆరంభంలో చెత్తగా ఆడిన ఈ జట్టు లీగ్ ఆఖరి దశలో పుంజుకుంది. వరుస విజయాలతో జోరును ప్రదర్శిస్తోంది. తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ పటిష్టమై న సన్‌రైజర్స్‌ను ఓడించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ సీజన్‌లో పేలవమైన ప్రదర్శనలు చేసిన కోహ్లీ సారథ్యంలోని ఆర్‌సిబి ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్న బెంగళూరు ప్రతిసారిలాగే ఈసారి కూడా గ్రూప్ దశను దాటలేక పోయింది. ఇక మంగళవారం తమ హోమ్ గ్రౌండ్స్‌లో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా నెగ్గి తమ అభిమానులకు మంచి ముగింపు అందివ్వాలని కోహ్లీ సేన భావిస్తోంది.
రాజస్థాన్‌కు చివరి అవకాశం
RELATED ARTICLES