మరో ముగ్గురు ఎంపిల మద్దతు ఉపసంహరణ
పార్లమెంటులో వాగాదం
కొలంబో : శ్రీలంక ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే రాజీనామా డిమాండ్‌ను తట్టుకుని నిలబడుతున్న దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రభుత్వానికి మరో ముగ్గురు ఎంపీలు బుధవారంనాడు మద్దతు ఉపసంహరించుకున్నారు. 225 మంది ఎంపీ సీట్లు ఉన్న పార్లమెంటులో రాజపక్స ప్రబుత్వానికి ఈనెలారంభంలో 39 మంది మద్దతు ఉపసంహరించారు. మొత్తం 156 మంది ఎంపీలకు గాను 39 మంది వైదొలగారు. ఈ చీలిక గ్రూపు ఎంపీలు స్వతంత్ర ఎంపీలుగా పార్లమెంటులో కూర్చుంటామని ప్రకటించారు. ఏ ఇతర కూటమితోనూ ప్రతిపక్షంతోనూ తమకు సంబంధం లేదని వారు ప్రకటించారు. అయితే అఖిలపక్షాలతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, రాజపక్స కుటుంబం మొత్తం పదవులకు రాజీనామాలు చేయాలని ఈ గ్రూపు డిమాండ్ చేస్తున్నది. శ్రీలంక ముస్లిం కౌన్సిల్ (ఎస్‌ఎల్‌ఎంసి) ఎంపి ఫైజల్ కాస్సిమ్ పార్లమెంటుకు సమాచారం అందిస్తూ, తనతోపాటు ఎంపీలు ఐజాక్ రహుమన్, ఎంఎస్ తౌఫీక్ కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామని ప్రకటించారు. ఈ ముగ్గురు ఎంపీలు ప్రతిపక్ష సమగి జన బలవేగయ (ఎస్‌జెబి) కూటమిలో భాగస్వామ్యం అవుతారు. వారితోపాటు ఎస్‌ఎల్‌ఎంసి కూడా ప్రతిపక్షంతో చేతులు కలుపుతారు. వారు 2020 నుండి రాజపక్సకు మిత్రులుగా ఉన్నారు. వివాదాస్పద 20 ఎ చట్టానికి మద్దతు ఇచ్చారు. ఈ చట్టం ద్వారా అధ్యక్షుడికి సంపూర్ణ అధికారాలు సమకూరుతాయి. పార్లమెంటులో బుధవారంనాడు ఉదయం ఎంపీల మధ్య తీవ్ర వాగాదం చెలరేగింది. రాజపక్స రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే అన్ని పార్టీల నాయకులు కూడా పదవులకు,సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తే ఆయనకూడా సిద్ధంగా ఉన్నారని స్పీకర్ మహింద యాప అబేయ్‌వర్దన చెప్పడంతో పార్లమెంటులో తీవ్ర ఘర్షణ చెలరేగింది. అబేయ్ వర్దన అధికార ప్రభుత్వ కూటమిలో సభ్యుడుగా ఉన్నారు. అయితే తాను అలా అనలేని, ప్రతిపక్ష ప్రేమదాస వక్రీకరించారని అన్నారు. అయితే ప్రధానప్రతిపక్షం మాత్రం అబేయ్ వర్దన పెద్ద అబద్ధాలకోరని, ఆయన అసత్యాలు చెబుతున్నారని విమర్శించింది.
భారీగా కొనసాగుతున్న నిరసనలు
కాల్పుల్లో ఒకరు మృతి
కాగా రాజపక్స రాజీనామా చేయాలని కోరుతూ ఆయన సచివాలయంవద్ద మంగళవారం నుండి భారీ ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీఎత్తున ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని రామ్‌బుక్కనలో పోలీసులు ప్రదర్శకులపై కాల్పులు జరపడంతో ఒకరు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనపట్ల అధ్యక్షుడు గొటబయ రాజపక్స తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని, వారు శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని ఆయన సలహా ఇచ్చారు. ‘శ్రీలంక ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉంది, వారిని అడ్డుకోకండి’ అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి మహింద రాజపక్స కూడా కాల్పుల ఘటనపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శకులు నిన్న మంగళవారంనాడు రైళ్ళను నిలిపివేశారు. చమురు ధరలు తగ్గించాలని వారు కోరుతున్నారు. ఈ విధంగా ఒక ప్రదర్శకుడు కాల్పుల్లో మరణించిన సంఘటన జరగడం ఇదే మొదటిసారి. అయితే ప్రజాభద్రతాశౠఖామంత్రి జగత్ అల్విస్ మాట్లాడుతూ, 33 వేల లీటర్లు ఉన్న ఒక చమురు ట్యాంకరును ప్రదర్శకులు దగ్ధం చేసేందుకు యత్నించారని, అనివార్యంగా పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి దౌత్యకార్యాలయాలు కూడా పోలీసులు జరిపిన ఈ కాల్పుల సంఘటనను ఖండించాయి. నిన్న మంగళవారంనాడు ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్లు నిరసనగా వాకౌట్ చేశారు. కాగా బుధవారంనాటికి గల్లే ఫేస్ నిరసన 12వ రోజుకు చేరుకుంది.
రాజపక్స ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
RELATED ARTICLES