సిబిఐ నుంచి మరో ముగ్గురు బదిలీ
అహ్మదాబాద్: కొత్త కేంద్ర పరిశోధన విభాగం (సిబిఐ) నియామకానికి ముందు చర్యగా నరేం ద్ర మోడీ ప్రభుత్వం వివాదాస్పద స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా సహా నలుగురు ఉన్నత శ్రేణి అధికారులను సిబిఐ నుంచి తొలగించింది. ఆస్థానా కాకుండా ఇంకా జాయింట్ డైరెక్టర్ అరుణ్ కు మార్ శర్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మనీశ్ కుమార్ సిన్హా, పోలీస్ సూపరింటెండెంట్ జె. జయంత్, నాయక్‌నవరేలను సిబిఐ నుంచి తొలగించారు. సిన్హా ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి కా గా, నాయక్‌నవరే మహారాష్ట్ర కేడర్‌కు చెందినవా రు. సిబ్బంది, శిక్షణ శాఖ(డిఒపిటి) జనవరి 17 న జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. స్పె షల్ డైరెక్టర్/జాయింట్ డైరెక్టర్ ర్యాంకులో ఉన్న నలుగురు సిబిఐ అధికారుల పదవీ కాలాన్ని కేబినెట్ నియామక కమిటీ వెంటనే అమలులోకి వచ్చే లా రద్దు చేసింది. ఈ అధికారులను వారి స్వంత శాఖలకు తిప్పి పంపడం లేదా వేరే పదవుల్లో కేంద్ర ప్రభుత్వం పంపించనుంది. అయితే డిఒపిటికి చెందిన అధికారి మాత్రం వారిని ‘వారి స్వంత శాఖ కేడర్‌కే తిప్పి పంపుతారు’ అన్నారు.