సమగ్ర వ్యవసాయ పాలసీని రూపొందిస్తాం
రైతులందరికీ మద్దతు ధర వచ్చేలా చర్యలు
సిఎం కెసిఆర్ వెల్లడి
హైదరాబాద్ : వర్షకాల కారణంగా అధ్వాన్నంగా మారిన రహదారులను యుద్ధప్రాతిపదికన రెండు మూడు నెలల్లో మరమ్మతులు చేపడుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. రహదారుల మరమ్మత్తులకు ప్రత్యేకంగా రూ. 570 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 28 కార్పొరేషన్లకు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలను చైర్మన్లు చేసేందుకు కావాల్సిన చట్టసవరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర వ్యవసాయ పాలసీని రూపొందిస్తామ న్నారు. జిఎస్‌టి వచ్చిన తర్వాత వస్తువులను ఎక్కడైనా విక్రయించవచ్చని, దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షతన పాలసీ రూపొందించనున్నట్లు వివరించారు. రైతులందరికీ మద్ద తు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేసేందుకు రూ. 7వేల కోట్ల గ్యారెంటీకి అనుమతినిచ్చామని, మరింత అవసరమైతే క్యాబినెట్ అవసరం లేకుండానే మరో రూ.4వేల కోట్ల వరకు గ్యారెంటీ ఇచ్చేందుకు ఆర్థిక శాఖకు సూచించామని తెలిపారు. వచ్చే జూన్‌లోపు రైతులను వ్యవస్థీకృతం చేస్తామన్నారు. వంద శాతం నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
రహదారుల మరమ్మతులకు రూ.570 కోట్లు కేటాయింపు
RELATED ARTICLES