HomeNewsBreaking Newsరష్యా మధ్య నేడు మళ్లీ చర్చలు

రష్యా మధ్య నేడు మళ్లీ చర్చలు

మరోవైపు విదేశీయుల తరలింపు యత్నాలు
నేడు భద్రతామండలి అత్యవసర సమావేశం
ఎల్వివ్‌ : ఉక్రేన్‌ తూర్పు ప్రాంతంలోని రెండు నగరాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, ఇతర విదేశీయులను సురక్షితంగా బయటకుతరలించేదుకు వీలుగా రష్యా దళాలు పరిమితస్థాయిలో తాత్కాలికంగా కాల్పుల విరామం పాటిస్తున్నారు. మరోవైపు సోమవారంనాడు ఉక్రేన్‌ మధ్య మూడో విడత చర్చలకు ఆలోచనలు,ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉక్రేన్‌ మధ్య మూడో విడత చర్చలు సోమవారం ప్రారంభం కాగలవని మరోవైపు ఉక్రేన్‌ ప్రతినిధి బృందంలోని సభ్యుడు దావ్యడ్‌ అరఖమియా చెప్పారు. అయితే ఇంతకుమించి ఎక్కువ వివరాలు, సమాచారం తాము చెప్పలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. చర్చలు ఎక్కడ జరిగేదీ కూడా ఆయన తెలియజేయలేదు. తొలుత ఈ చర్చలు టర్కీలో జరుగుతాయన్న వార్త వెలువడింది. ఇదింకా ధృవీకరణ కాలేదు. మరోవైపు ఉక్రేన్‌లో దిగజారిన పరిస్థితులపై సమీక్షించేందుకు సోమవారంనాడు భద్రతామండలి మరోసారి అత్యవసర సమావేశం కానున్నది. తొలివిడత,రెండోవిడత చర్చలు బెలారస్‌ సరిహద్దుల్లో జరిగాయి. బెలారస్‌లోనే తాత్కాలికంగా కాల్పుల విరమణకు, మానవతా కారిడార్‌ నిర్వహణకు అంకురార్పణ జరిగింది. పిల్లలు, వృద్ధులు, విదేశీయులు సురక్షితంగా యుద్ధ ప్రాంతాల నుండి వెళ్ళిపోయేందుకు రష్యా అంగీకరించింది. వేలాదిమందికి నీరు, ఆహార కొరత ఏర్పడే పరిస్థితి రావడంతో అనివార్యంగా ఈ మానవతా కారిడార్‌ తెరిచేందుకు ఒప్పందం జరిగింది. ఈ ప్రాంతాల్లో చాలామంది గాయాలతో బాధపడుతున్నవారున్నారు. వారందరికీ ఔషధ, చికిత్స సేవలు అందజేయాల్సి ఉంది. రేవు నగరం మరియోపోల్‌, వోల్నోవకా నగరాలను విదేశీయులు సురక్షితంగా బయటకు తరలించేందుకు వీలుగా తెరచినట్లు రష్యా సైనిక అధికారి ఎడ్యుయార్డ్‌ బాసురిన్‌ చెప్పారు. ఆయన వేర్పాటువాదులుండే డొనెట్స్‌ ప్రాంతం నుండి మాట్లాడారు. అయితే ఇతర వివరాలు తెలియజేయలేదు. ఉక్రేన్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. డోనెట్స్‌ ప్రాంతాధిపతి పావ్లో కిరిలెంకో మాట్లాడుతూ, ఉదయం 10 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకూ ఈ తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉంటుందని అన్నారు. అయితే ఉక్రేన్‌లో స్థానికంగా ప్రతిఘటన ఎదురుకావడంతో రష్యా సేనలు శనివారంనాడు మరియోపోలో నగరంలో ఈ కాల్పుల తాత్కాలిక విరామాన్ని పాటించడంలో విఫలమయ్యాయి. రష్యా దేశాధ్యక్షుడు వ్లదిమీర్‌ పుతిన్‌ ఈ విషయంలో ఉక్రేన్‌ను తప్పుపట్టారు. రష్యా సైన్యాన్ని ప్రతిఘటించడంపై మాట్లాడుతూ, ఉక్రేన్‌ స్వయంప్రతిపత్తికి ఈ చర్యలు విఘాతం కలిగిస్తాయన్నారు. పశ్చిమదేశాలు రష్యాపై వరుల ఆంక్షలు అమలు చేయడాన్ని పుతిన్‌ నిశితంగా విమర్శించారు. స్థానిక సైనికాధికారుల చ్య్రలవల్లే కాల్పుల విరామం అమలు కాలేదన్నారు.మరోవైపు మిగిలిన ఉక్రేన్‌ ప్రాంతాల్లో సైనిక చర్య కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఉక్రేన్‌ నుండి 14 లక్షలమంది పొరుగున ఉన్న ఇతర దేశాలకు వలస వెళ్ళినట్లు ఐక్యరాజ్యసమితి తెలియజేసింది.
అయితే తొలుత ముందురోజు శనివారంనాడు మరియోపోల్‌ మేయర్‌ వాదైమ్‌ బోయ్‌చెంకో ఒక ప్రకటన చేస్తూ, వృద్ధులు, పిల్లలు సహా వేలాదిమంది నివాసితులు సురక్షితంగా నగరం నుండి వెళ్ళిపోయేందుకు రోడ్లమీద గుమికూడారని చెప్పారు. అయితే ప్రతిఘటనవల్ల తిరిగి కాల్పులు ప్రారంభం కావడంతో అందరూ ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారని చెప్పారు. మరియోపోల్‌ నగరం ముట్టడిలో ఉందని, సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని మేయర్‌ బోయ్‌చెంకో ఉక్రేన్‌ టీవీలో మాట్లాడుతూ చెప్పారు. నివాసిత ప్రాంతాలపై అవిరామంగా గుళ్ళవర్షం కురుస్తోందని ఆయన ఆరోపించారు. గగనతలం నుండి నగరంలోకి బాంబులు కురిపిస్తున్నారన్నారు. వీటిల్లో గ్రాండ్‌ మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్లు ఉన్నాయని చెప్పారు.
దక్షిణ ఉక్రేన్‌లో రష్యా దళాలు గణనీయమైన పురోగతి సాధించాయి. ముందుకు దూసుకువెళుతున్నాయి. దక్షిణాన ఉన్న అవ్రోవ్‌ సముద్రతీర ప్రాంతంవైపు ఉక్రేన్‌ కదలికలను నిలిపివేసే దిశగా రష్యా సేనలు వెళుతున్నాయి. రష్యా సేనలను ప్రతిఘటించాలని ఉక్రేన్‌ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. మీ నగరాన్ని ఆక్రమించుకున్నప్పుడు మీరు ప్రతిఘటించాలి అని శనివారం రాత్రి జెలెన్‌ తన తాజా వీడియో సందేశంలో జాతికి పిలుపు ఇచ్చారు.శత్రువులు మన దేశంలోకి ప్రవేశించారని,వారిని ప్రతిఘటించాలని అన్నారు. మీరు వీధుల్లోకి రావాలి, మీరు పోరాడి తీరాలి అని ఆయన అన్నారు. ఉక్రేన్‌ దక్షిణ రేవు నగరం ఖెర్సాన్‌ను రష్యా సేనలు ఈ వారంలోనే స్వాధీనం చేసుకున్నాయి. ప్రజలను చెల్లాచెదురు చేసేందుకు సైనికులు అడపాదడపా హెచ్చరిక గుర్తుగా కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికే రష్యా సేనలు ఖార్కివ్‌,మైకోలైవ్‌,చెర్నిహివ్‌, సుమీ ప్రాంతాలను చుట్టుముట్టాయి. సుమీలో భారతీయ విద్యార్థులు చికక్కుకుపోయారు. సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు సుమీ నగరంలో ఉన్నారు. ఇప్పుడు సుమీ నుండి వారిని తరలించడం భారత్‌కు ఒక సవాలుగా మారింది. అయితే రష్యా ఇచ్చిన హామీతో భారత్‌ కొంత ఊపిరి పీల్చుకుంది. సుమీలో ఉన్న విద్యార్థులకు ప్రాథమిక హెచ్చరికలు చేసి, జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఉక్రేన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడుతూ, మూతపడిన చెర్నోబైల్‌ అణు కర్మాగారంతో సహా మొత్తం ఉన్న నాలుగు అణు కేంద్రాలకు గాను మూడో అణు కేంద్రం దిశగా రష్యా సేనలు కదులుతున్నాయని చెప్పారు.
ఉక్రేన్‌కు 10 బిలియన్‌ డాలర్ల అత్యవసర మానవతా సహాయం అందించాలన్న జెలెన్‌స్కీ విజ్ఞప్తి ఇప్పటికే అమెరికా కాంగ్రెస్‌ పరిశీలనలో ఉంది. ఉక్రేన్‌ దేశం వెలుపల, లోపల మానవతాసహాయం పెంచాలని ఐక్యరాజ్యసమితి కోరింది. ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రేన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించడంతో ఒక్కసారిగా అంతర్జాతీయ రాజకీయముఖచిత్రంలో పెను మార్పులు సంభవించాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments