లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో ఇబ్బంది పడుతున్న కార్మికులని ఆదుకునేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కార్మికులకి 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. అలానే తమిళ హీరో విజయ్ సేతుపతి 10 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఇక సూర్య, కార్తి, శివ కుమార్ కలిసి పది లక్షల రూపాయల ఇవ్వనున్నట్టు తెలియజేశారు. తమ హీరోలు ఇంతటి ఔదార్యం చూపించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన దగ్గర పని చేసే వారికి మే నెల వరకు జీతాలు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ వలన మార్చి 19 నుండి 31 వరకు షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకి సంబంధించిన చలనచిత్ర పరిశ్రమలో వివిధ వర్తకాలకు చెందిన 23 యూనియన్లు , టెలివిజన్ పరిశ్రమలో 25 వేల మంది సభ్యులు పొట్ట నింపుకునేందుకు చాలా కష్టాలు పడుతున్నారు. వీరి పరిస్థితిని గమనించి సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకు రావడం అభినందనీయం.
రజనీ రూ. 50లక్షల విరాళం
RELATED ARTICLES