13 ఏళ్ల తరువాత ట్రోఫీ పోరుకు టైగర్స్
కోల్‌కతా: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. కర్ణాటకతో మంగళవారం ముగిసిన సెమీఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ 174 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 13 ఏళ్ల తర్వాత రంజీ ఫైనల్ చేరింది. 2006–07 సీజన్‌లో చివరి సారిగా ఫైనల్ చేరిన బెంగాల్.. తుదిపోరులో ముంబై చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది. అయితే ఈ సారి ఎలాగైన టైటిల్ గెలుచుకొని 30 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. 1989–90 సీజన్‌లో తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలిచింది. ఇక బెంగాల్ నిర్ధేశించిన 352 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. బెంగాల్ బౌలర్ ముకేశ్ కుమార్ (6/61) ధాటికి 56 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. 98/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కర్ణాటక.. ఓవర్ నైట్ స్కోర్‌కు 79 పరుగులే జోడించి ఓటమికి తలవొంచింది. నాలుగో రోజు 18 ఓవర్ల పాటే ఆట కొనసాగడం గమనార్హం. ఆ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 26 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. పడిక్కల్ (62), మిథున్ (38) టాప్ స్కో రర్లుగా నిలిచారు. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ ఆరు వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించగా.. ఇషాన్ పొరెల్, ఆకాష్ దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెం గాల్ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటవ్వగా.. కర్ణాటక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్ 190 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిం ది. కర్ణాటక బౌలర్లు చెలరేగడంతో బెంగాల్ 161 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని కర్ణాటక ముందు 352 పరుగుల లక్ష్యం.. ఆ జట్టు చేధించలేకపోయింది.
రంజీ ఫైనల్లో బెంగాల్
RELATED ARTICLES