HomeNewsరంగారెడ్డి జిల్లా వార్త‌లు (31-03-2020)

రంగారెడ్డి జిల్లా వార్త‌లు (31-03-2020)

వలస కార్మికులు బియ్యం పంపిణి

ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో కుటుంబ ఆహార భద్రతా కార్డు దారుల తోపాటు,వలస కార్మికులకు బియ్యం పంపిణి కార్యక్రమం మంగళవారం విజయవంతంగా నిర్వహించారు.రంగారెడ్డి జిల్లా పరిధిలోని జీహెచ్ఎంసీ తో కలుపుకొని మొత్తం 4,89,705 ఆహార భద్రతా కార్డులుండగా వీటిలో 16,56,674 మంది లబ్దిదారులున్నారు.వీరందరికీ ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందించేందుకై జిల్లా పాలన యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.వీరితోపాటు వలస కార్మికులకు బియ్యం పంపిణి చేపట్టారు.ఇప్పటికే గుర్తించిన కార్మికుల్లో చేవెళ్ల మండలం లో 178,షాబాద్ మండలం లో 682, శంకరపల్లి మండలం లో 3,857,మొయినాబాద్ మండలం లో 642 మంది ఉన్నారు.వీరికి ఉచితంగా బియ్యం పంపిణీతో పాటు నగదు ను రెవిన్యూ అధికారులు అందజేశారు.కాగా వలస కార్మికులకు బియ్యం,నగదు పంపిణి కార్యక్రమాన్ని సైబరాబాద్ సీపీ వీ.సి.సజ్జనార్,జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ బండ్లగూడ, కిస్మత్ పుర,రాజేంద్రనగర్ లలో పరిశీలించారు.కాగా మంగళవారం మండలంలో వైద్య బృందాలు హోమ్ క్వారంటైన్ ను తనిఖీ చేసారు.ఈ మండలం లో ఉన్న 38 మంది హోమ్ క్వారంటైన్ లోనే వున్నారని,వారికి ప్రత్యేక స్టాంప్ వేయడం తోపాటువారి ఇళ్లకు ప్రత్యేక స్టిక్కర్లను అతికించినట్టు వైద్య ఆరోగ్య శాకాదికారి తెలిపారు. దీనితోపాటు,ఇటీవల ఢిల్లీలో జరిగిన జమాతే సభలో పాల్గొని వచ్చినవారి వివరాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పోలీస్ కమీషనర్ సజ్జనార్,కలెక్టర్ అమయ్ కుమార్ లు విచారించే పక్రియను పర్యవేక్షించారు. కందుకూరు రెవిన్యూ డివిజన్ లో హోమ్ క్వారెంటైన్ లోఉన్న వారిని, రాజేంద్ర నగర్ డివిజన్ లో క్వారంటైన్ లోఉన్న వారిని తమ సర్వేలెన్స్ బృందాలు పరిశీలించాయని వీరందరిలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు రాలేదని రెవిన్యూ అధికారులు తెలిపారు.

పేదలను ఆదుకుందాం

-కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు సహకరిద్దాం -వలసకూలీలు,నిరుపేదలను గుర్తించి భోజన వసతి కల్పిద్దాం -బీజేపీ రాష్ట్ర కార్యదర్శి,చేవెళ్ల పార్లమెంట్ ఇన్ చార్జీ బి.జనార్ధన్ రెడ్డి

ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కరోనా మహమ్మారితో కడుపు మాడుతున్న నిరుపేదలు,వలస కూలీలు,యాచకుల ఇబ్బందులను గుర్తించడం తోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు మంగళవారం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మెయినాబాద్ ప్రాంతాలలో పేదలకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జీ బి. జనార్ధన్ రెడ్డి బోజన వసతి ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు పేదల కోసం ఆలోచించి అనేక చర్యలు చేపట్టాడ౦ జరుగుతుందని అన్నారు.కేంద్రం ఇప్పటికే బియ్యం, పప్పు పేదలకు అందించేందుందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.జాతీయ అధ్యక్షుడి ఇచ్చిన పిలుపులో భాగంగా పార్లమెంట్ లోని ఆయా నియోజకవర్గాల్లో పేదలకు భోజనాలు అందిస్తామని,బీజేపీ నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని స్వీకరించి తమ వంతుకు సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రజలందర కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కట్టడికి అందరూ బాధ్యత వహించాలని కోరారు.వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు,బయటకు వచ్చినప్పుడు దూరం పాటించాలని తెలిపారు.

పాస్ ల చెల్లుబాటు పొడిగింపు

-సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్

ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం మార్చి 28 ఇచ్చిన కోవిడ్-19 నియంత్రణ, సంబంధిత ఉత్తర్వులను 2020 ఏప్రిల్ 14 వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పొడిగించింది. అందువల్ల సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనర్, అవసరమైన సేవలు, సైబరాబాద్ కమిషనరేట్ నుండి పాస్ చెల్లుబాటు తేదీ మార్చి 31ని ఏప్రిల్‌ 15వరకు పొడిగించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాస్ హోల్డర్లు చెల్లుబాటు తేదీ పోడగిపొడగింపు పాస్ హోల్డర్లు గమనించవలసింది కోరారు.సైబరాబాద్ కమిషనర్ జారీచేసిన పాసులు సైబరాబాద్, హైదరాబాద్,రాచకొండలో కూడా చెల్లుబాటు అవుతాయని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూం 9490617440/431 లను సంపాదించాల్సిందే కమిషనర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. Covidcontrolcyb@gmail.com కు ఇమెయిల్ పంపండని తెలిపారు.

మాస్కుల తయారీ తో అదనపు ఆదాయాన్ని పొందుతున్న శంకర్ పల్లి మహిళలు

ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రపంచాన్ని వనికి స్తున్న కరోనా వైరస్ నివారణకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుజాగ్రత్తలు చేపడుతున్నారు.దీనిలో భాగంగా చెడు గాలి,బ్యాక్టీరియా దరిచేరకుండా ఉండేందుకుగాను పెద్ద ఎత్తున మాస్కులను వాడుతున్నారు.దీనితో మాస్కులకు కొరత ఏర్పడడం, అధికధరలకు మాస్కులవిక్రయం నిత్యకృత్యమయింది.మాస్కుల కొరత రంగారెడ్డి జిల్లా స్వయం సహాయక మహిళలకు సరికొత్త ఆదాయ మార్గంగా మారింది. జిల్లాలోని శంకరపల్లి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మాస్కుల తయారీ ముమ్మరంగా నడుస్తోంది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో స్వయం సహాయక సంఘంల మహిళలకు మాస్కుల తయారీ మంచి ఆదాయ వనరుగానే కాకుండా సామాజిక సేవగానూ మారిందని రంగారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.మార్కెట్లో ఒక్కొక్క మాస్క్ కనీసం నలభై రూపాయలనుండి వంద రూపాయలకు పైబడి ఉందని, అయితే మన స్వయం సహాయక మహిళలు తయారు చేసే మాస్క్ మాత్రం కేవలం 15 రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నామని తెలిపారు.కేవలం ఒక్క శంకరపల్లి లోనే రోజుకు 500 లకు పైగా మాస్కుల తయారీ జరుగుతోందని, మాస్కులకు డిమాండ్ బాగా ఉందని అన్నారు.కాగా నిన్నటి వరకు మాస్కుల తయారీకి ఉపయోగించే క్లాత్ కిలోకు 150 రూపాయలనుండి 200 వరకు మార్కెట్ లో లభ్యమవుతుండగ,నేడు అది కిలో క్లాత్ ధర ఒక్కసారిగా 400 రూపాయలకు పెరిగిందని,లాక్ డౌన్ వల్ల బయటి రాష్ట్రాలనుండి క్లాత్ రాకపోవడమే నని పీడీ తెలిపారు. ఎన్నిమాస్కులైనా తయారీకి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ క్లాత్ కొరత ఉందని అన్నారు.మొత్తానికి మాస్కుల తయారీ రంగా రెడ్డి జిల్లా స్వయం సహాయక మహిళలకు ఉపాధి తోపాటు ఆదాయ మార్గంగా మారింది.

పాదచారుల విశ్రాంతి కేంద్రంలో భోజన వసతి

* బియ్యం, కూరగాయలు పంపిణీ చేసిన కౌన్సిలర్లు.

ప్రజా పక్షం /తుర్కయంజాల్ :కరోనా వైరస్ పుణ్యమా అని ఇండియా లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదేబాటలో పయనించడం తో వలసకూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది.దీనిని దృష్టిలో ఉంచుకొని తుర్కయంజాల్ మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ దేవేందర్ రెడ్డి రాగన్నగూడలో ని ప్రభుత్వ పాఠశాలలో గత మూడు రోజుల క్రితం పాదాచారుల విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మర్రి మాధవి మహేందర్ రెడ్డి, రొక్కం అనిత చంద్రశేఖర్ రెడ్డి, రేవల్లి హరిత యాదగిరి, కుంట ఉదయ్ శ్రీ గోపాల్ రెడ్డి పాదచారుల విశ్రాంతి కేంద్రంలో బియ్యం, కూరగాయలు, నూనె అందజేశారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రశాంతి, ఆర్.ఓ వేణుగోపాల్ రెడ్డి, ఎం ఫోర్స్ మెంట్ సిబ్బంది బి.శ్రీనివాస్, బిల్ కలెక్టర్లు మంజుల,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

వరి,మొక్కజొన్న కొనుగోళ్లపై దిశ, నిర్దేశం

-వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి

ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కోవిద్-19 సందర్బంగా రాబోవు వరి,మొక్కజొన్న కొనుగోళ్లపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి దిశ,నిర్దేశం చేశారు.మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ జిల్లాల వ్యవసాయ అధికారులతో వ్యవసాయ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలోని వివిధజిల్లాలలో గల 11,697 పంటకోత యంత్రాలు గుర్తించగా వాటిలో ఎన్ని రాష్ట్రానికి చెందినవి,ఎన్ని ఇతర రాష్ట్రానికి చెందినవి గుర్తించి వాటి సమాచారం కమీషనర్ కా ర్యాలయానికి పంపవలసిందిగా కోరారు.
అదే విధంగా వివిధ ఐ.కే.పి కేంద్రాలలో గల కాంటా తూకాలు, తేమ శాతం అంచనా వేసే మీటర్స్, టార్పలిన్స్ లభ్యతపై సమాచారం అందించాలన్నారు.
అంతర్ ర్రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతి లేక ఆగిపోయిన పంట కోత యంత్రాల వివరాలు సేకరించి పోలీస్ శాఖ సహకారంతో వాటికీ పాసులు ఇప్పించవలసినదిగా సూచించారు.యంత్రాలకు సంబందించిన డ్రైవర్ల కు స్పేర్ పార్ట్స్,రిపేరింగ్ మరియు సప్లై చేసే వారికి,మెకానిక్స్ కి,హమాలీలకు, కూరగాయలు,పండ్లు రవాణా చేసే వాహనాల కు పాసులను అందజేయ వలసినదిగా తెలిపారు.
పంట కోత యంత్రాలను బట్టి రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లే విధంగా టోకెన్లను ఇచ్చి రద్దీని నివారించడానికి తగిన ముందస్తు ప్రణాలికను తయారు చేసుకోవలని అధికారులను ఆదేశించారు.వీటికి మార్కెటింగ్ శాఖ నిధులను ఉపయోగించవలసినదిగా స్పష్టం చేశారు.
రాబోవు ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సకాలంలో విత్తనాలు,ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసేందుకు వాటికి సంబంధించిన సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు,ఎరువులు, పురుగు మందుల డీలర్లకు తగిన పాసులు పోలీస్ శాఖ ద్వారా ఇప్పించడం పై చర్యలు తీసుకోవలసిందిగా తెలిపారు.
పైవాటికి సంబంధించిన పాసులకు,అనుమతుల కొరకు లిస్టులను తాయారు చేసి వ్యవసాయ శాఖ ద్వారా పోలీస్ డిపార్టుమెంటు వారికీ అందచేయవలసినదిగా నిర్ణయించారు.రైతు బంధు, సమన్వయ సమితి సభ్యులతో సమన్వయం చేసుకొని కొనుగోలు కార్యక్రమాలు నిర్వహించవలని అన్నారు.
కోవిడ్ -19 వచ్చిన సందర్బంగా రైతులను అప్రమత్తంగ ఉండవలెనని,ఆ దిశగా జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవలని సూచించారు.

ప్రజల సౌకర్యార్థం వి.యం హోమ్ కు రైతుబజార్

ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మహేశ్వరం,ఎల్బీనగర్ నియోజకవర్గంల ప్రజలకు అందుబాటులో ఉండటానికి సరూర్‌నగర్‌ విక్టోరియా మెమోరియల్ హోం లోని విశాలమైన మైదానంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా,కరోనా వైరస్ బారిన పడకుం సౌకర్యవంతంగా ఉండాలనే ఆలోచనతో కొత్తపేట్ రైతు బజార్ ను తాత్కాలికంగా మూసివేసి విక్టోరియా మెమోరియల్ హోమ్ మైదానంలో ఏర్పాటు చేశామని,దీనిని ప్రజలు సక్రమంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం తాత్కాలిక రైతుబజార్ ను ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి,గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ వీరమల్ల రామ నరసింహ గౌడ్,సరూర్ నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, కొత్తపేట,గడ్డి అన్నారం కార్పొరేటర్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతు బజార్ షాపులలో ఉన్న రైతులను స్వయంగా వెళ్లి పలకరించి ఏర్పాట్లుఏ విధంగా ఉన్నాయని అడిగి తెలిపారు.రైతు బజార్ వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చుడాలని,రైతు బజార్ కి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి మార్కెటింగ్ అధికారులు ఏర్పాటు చేసిన శానిటైజర్లు తో చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కరోనా వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజలు కూడా దీనికి సహకరించి స్వీయనిర్బంధంలో ఉండాలని, పనిలేకుండా అనవసరంగా రోడ్ల మీదికి రావద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పారుపల్లి దయాకర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బేరా బాలకిషన్(బాలన్న), సరూర్‌నగర్‌ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆకుల అరవింద్ కుమార్,రామకృష్ణాపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మూరుకుంట్ల అరవింద్ శర్మ,కిీల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్,సాజీద్ నాగేష్, మహేశ్వరం నియోజకవర్గంవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు లోక సాని కొండల్ రెడ్డి, మాజీకౌన్సిలర్ ధర్పల్లి అశోక్, సిరిపురం రాజేష్గౌడ్ శ్రీనివాస్ గౌడ్ పల్లి శ్రీనివాస్,రిషి జంగారెడ్డి, సుదర్శన్ ముదిరాజ్,రాఘవేంద్ర గుప్తా,సిలివేరు వెంకట్ గౌడ్, లతోపాటు గడ్డిఅన్నారం మార్కెట్ ఎస్ జీఎస్ వెంకటేష్,రైతు బజార్ ఎస్టేట్ ఆఫిసర్ స్రవంతి, జిహెచ్ఎంసి సరూర్‌నగర్‌ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ హరి కృష్ణయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ గౌడ్,మార్కెట్ కమిటీ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments