ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కరోనా వైరస్ పై రంగారెడ్డి జిల్లాలో రెడ్ జోన్ లు ప్రకటించినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ అమెాయ్ కుమార్ ప్రకటించారు.నేడు ఒక(ప్రజాపక్షం కాదు)దినపత్రికలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటించినట్టు వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు. జిల్లాలో కరోనా వైరస్ నివారణకు విస్తృత చర్యలు చేపట్టామని, ముఖ్యంగా లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే వారు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో రెడ్ జోన్ లు లేవు… కలెక్టర్ అమెాయ్ కుమార్
RELATED ARTICLES