కానీ, పుల్వామా ఘటనతో సంబంధం లేదు
మా ప్రమేయం ఉందన్న ఆధారాలు ఉంటే ఇవ్వండి : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: ఒకవేళ భారత్ ‘చర్యలు తీసుకునేందుకు రహస్య సమాచారాన్ని’ పంచుకునేట్లయితే పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన వారిపై తాను చర్యలు తీసుకుంటానని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం వాగ్దానం చేశారు. అయితే భారత్ దాడికి దిగితే మాత్రం పాకిస్థాన్ ప్రతిదాడికి దిగుతుందని కూడా హెచ్చరించారు. కశ్మీర్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందని భారత్ చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందనగా ఆయన జాతినుద్దేశించి చేసిన వీడియో సందేశంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ఉగ్రదాడిచేస్తే మాకేంటి ప్రయోజనం? : భారత్‌లో ఈ సంవత్సరం ఎన్నికలు జరుగనున్నాయన్న విషయం తాను అర్థం చేసుకోగలనని, సునాయాసంగా ఓట్లను రాబట్టుకోడానికి పాకిస్థాన్‌పై నిందలు మోపడం చాలా సులువని అన్నారు. ‘ఉగ్రదాడితో పాక్‌కు సంబంధాలున్నాయని చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. ఇలాంటి దాడి చేస్తే మాకేంటి ప్రయోజనం. మేం ఉగ్రవాదాన్ని కాదు, స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ దిశగా పయనిస్తున్నాం. పుల్వామా దాడిపై మమ్మల్ని నిందించకండి. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ మాపై ఆరోపణలు చేస్తోంది. ఆధారాలుంటే మాకివ్వండి. శాంతి కోసం చేస్తున్న పోరాటంలో మేం ఇప్పటికే లక్షలాది మంది ప్రజలను కోల్పోయాం. గత 15 ఏళ్లలో ఉగ్రవాదానికి మా బలగాల్లో 70,000 మంది సిబ్బందిని పోగొట్టుకున్నాం. మా భూమిపై నుంచి ఇతర దేశాల మీ ద, ఇతర దేశాల నుంచి మా భూమిపై ఉగ్రదాడులను మేము అనుమతించం. మీరన్న ట్లు నిజంగానే దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు తేలితే దర్యాప్తునకు సహకరించేందు కు మేం సిద్ధంగా ఉన్నాం. దానికి నేను హామీ ఇస్తున్నా’ అని ఇమ్రాన్ చెప్పుకొచ్చా రు.