పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బెదిరింపు
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ను రద్దు చేయడం వల్ల పుల్వామా వంటి దాడు లు జరగొచ్చని, దానివల్ల పాక్, భారత్ మధ్య యుద్ధం జరగొచ్చని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం అన్నారు. యుద్ధంలో ఎవ రూ గెలువరని… కానీ దాని పరిణామాలు ప్రపంచం మీద పడతాయన్నారు. మంగళ వారం ఆయన ఆ దేశ పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్వైద్-ఎ- మహ్మద్ అలీ జిన్నా అవిభక్త భారత దేశంలో మైనార్టీలు ఎలాంటి దుర్భర పరిస్థితు లను ఎదుర్కొంటారో ముందే ఊహించార న్నారు. ‘పుల్వామా ఉగ్ర ఘటన వెనక పాకి స్థాన్ హస్తం లేదని చెప్పడానికి మేం ప్రయ త్నించాం. మెజార్టీ ప్రజల కోసమే భారత్ అని వారు ఇప్పటికీ భావిస్తున్నారు. ప్రస్తుతం నెల కొన్న పరిస్థితులను చూస్తుంటే ఆ దేశంలో పౌరులందరూ సమానం కాదని స్పష్టమవు తోంది. నేను భారత్‌కు వెళ్లినప్పుడు కొందరితో మాట్లాడాను. వారు రెండు దేశాల సిద్ధాంతం పట్ల సుముఖంగా కనిపించలేదు. పాకిస్థాన్ ఏర్పడకుండా ఉంటే బాగుండేది అన్నారు. కశ్మీర్‌ను మార్చాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది జెనీవా ఒప్పందం, భార త రాజ్యాంగానికి విరుద్ధం. ఇదే సిద్ధాంతాన్ని భారత ఆక్రమిత కశ్మీర్‌లో నిన్న ఆ దేశ ప్రభుత్వం అమలు చేసింది. అక్కడ జాతి ప్రక్షా ళనకు పాల్పడుతోంది. ఆధిక్యంలో ఉన్న వర్గా న్ని అణచి వేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది అక్కడి ప్రజలను ప్రతీకారం వైపుకు నెడు తోంది. మరిన్ని పుల్వామా వంటి ఘటనలకు కారణమవుతుంది’ అని ఇమ్రాన్ భారత్ మీద విషం కక్కారు. దీనికి ముందు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేశాక, తమ దేశం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు మంగళవారం కూర్చున్న పాకిస్థాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశం అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా వాయిదాపడింది. భారత్‌కు వ్యతిరేకంగా రూపొందించిన తీర్మానం భాష తీరుపై ఆ రెండు పక్షాలు విభేదించుకున్నాయి. పార్లమెంటు సంయుక్త సమావేశం మొదలు కాగానే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆజం ఖాన్ స్వాతి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నియంత్రణ రేఖ వద్ద భారత్ ఉల్లంఘనలకు పాల్పడడాన్ని ఖండించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హాదాను ఇస్తున్న ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. దాంతో విపక్షాలు నిరసన తెలిపి, బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించాయి. దాంతో స్పీకర్ అసద్ ఖైజర్ సమావేశాన్ని వాయిదా వేశారు. తీర్మానాన్ని సవరించాకే మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన సభను వాయిదావేస్తూ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని తీర్మానంలో ప్రస్తావించకపోవడం వల్లే విపక్షాలు వేరే దారిలేక నిరసనకు దిగాయని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నాయకుడు అహ్‌సాన్ ఇక్బాల్ మీడియాకు చెప్పారు. ‘భారత్ అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే దానిని తీర్మానంలో ప్రభుత్వం ప్రస్తావించలేదని విపక్షాలు నిరసన చేశాయి’ అని కూడా ఆయన చెప్పారు. భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం గురించి ప్రకటించాక పాక్ పార్లమెంటు సంయుక్త సమావేశానికి ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సోమవారం పిలుపునిచ్చారు.