భారత్‌తో సాంప్రదాయ యుద్ధానికే అవకాశాలు
ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేశాక భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తేలేదు. భారత్‌తో సాంప్రదాయ యుద్ధం జరగొచ్చు. అది భారత ఉపఖండాన్ని కూడా దాటొచ్చు. అందుకే మేము ఐక్యరాజ్యసమితికి వెళ్లాం. ప్రతి అంతర్జాతీయ వేదికను ఆశ్రయించాం. వారిప్పుడు సరిగా వ్యవహరించాలి’ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. ‘పాకిస్థాన్ యుద్ధాన్ని మొదలెట్టదు. నేను అహింసావాదిని, యుద్ధవ్యతిరేకిని. ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కనుగొనలేదని నేను నమ్ముతాను’ అని ఆయన అల్ జజీరా టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే, మొదట సాంప్రదాయ యుద్ధమే మొదలైనప్పటికీ అది చివరికి అణు యుద్ధంగా రూపాంతరం చెందుతుంది. ఊహించని విధంగా యుద్ధం ఉండగలదు’ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ‘ఒకవేళ సాంప్రదాయ యుద్ధమే మేము చేస్తే, మేము(పాకిస్థానీలు) ఓడిపోతాం. లొంగిపోవడమా లేక స్వేచ్ఛ కోసం అంతం వర కు పోరాడ్డమా?… అన్నది ఎంచుకోవలసిన పరిస్థితే వస్తే…. పాకిస్థానీలు తమ స్వేచ్ఛ కోసం తుది వరకు పోరాడతారని నాకు తెలుసు’ అన్నారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేయడం, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో భారత, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రికత్త ఏర్పడింది. భారత్‌తో దౌత్య సంబంధాలను కూడా పాకిస్థాన్ తగ్గించుకుంది. భారత హైకమిషనర్‌ను బహిష్కరించింది కూడా. పాకిస్థాన్ ఇటీవల పొరుగు దేశంతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు భారత్‌తో చర్చలు ఆరంభించింది. చర్చల ద్వారా కశ్మీర్‌కు ఓ రాజకీయ పరిష్కారం చూడాలని కూడా చూసింది’ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఎటిఎఫ్) బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని కూడా భారత్ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ‘ఒకవేళ ఎఫ్‌ఎటిఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్థాన్‌ను ఉంచితే దానివల్ల పాకిస్థాన్‌పై ఆంక్షలు పడతాయి. అంటే మనల్ని వారు ఆర్థికంగా దివా లా తీయాలని అనుకుంటున్నారు. పాకిస్థాన్‌ను వారు వెన క్కి నెట్టేస్తే దేశం ఉపద్రవంలో పడిపోతుంది’ అని వివరించారు. ‘భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 370ని ఉపసంహరించడం వల్ల భారత ప్రభుత్వంతో ప్రస్తుతానికైతే చర్చలు జరపబోము. వారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని కూడా అతిక్రమించి అక్రమంగా జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాపై వేటువేశారు. ఆర్టికల్ 370ను రద్దు చేయడమన్నది తమ అంతర్గత విషయమని, పాకిస్థాన్ చేస్తున్నవన్నీ భారత వ్యతిరేక వ్యాఖ్యానాలని, బాధ్యతారాహిత్యమైనవని వారు వాదిస్తున్నారు’ అని ఇమ్రాన్ ఖాన్ అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నియంత్రణ రేఖ వద్దకు పాక్ మార్చ్ నిలిపివేత
సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించేంత వరకు నియంత్రణ రేఖ వరకు నిర్వహించాలనుకున్న నిరసన ప్రదర్శనను కొన్ని పాక్ రాజకీయ పార్టీలు, మత పక్షాలు నిలిపేశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు, మత పక్షాల నేతలున్న కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పాకిస్థాన్‌లోని ‘డాన్’ పత్రిక పేర్కొంది. శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ‘నియంత్రణ రేఖ వరకు నిరసన ర్యాలీని నిర్వహించాలని పాక్ యువత కోరుకున్న విషయం నాకు తెలుసు’ అన్నారు. అయితే ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తాను మాట్లాడేంత వర కు ఆ నిరసన ర్యాలీని కశ్మీరీ బాలలు బడులకు వెళ్లేలా చూడాలి: మలాల
ఆపేయాలని కూడా ఆయన కోరారు.
లండన్: ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కశ్మీరీ బాలలు పాఠశాలలకు వెళ్ళేలా సాయపడాలని, కశ్మీర్‌లో శాంతి నెలకొనేందుకు కృషిచేయాలని నోబెల్ గ్రహీత మలాల యూసఫ్‌జాయ్ కోరారు. ఆగస్టు 5 నుంచి కశ్మీర్‌లో సాధారణ స్థితి దెబతింది. దుకాణాలు, పాఠశాలలు చాలా వరకు మూతపడ్డాయి. రోడ్లపై రవాణా వసతులు కూడా ఆగిపోయాయి. ‘కశ్మీర్‌లో శాంతి కోసం పాటుపడాలని నేను ఐక్యరాజ్యసమితి సాధారణ సభలోని నాయకులను కోరుతున్నాను’ అన్నారు. కశ్మీర్‌లో బాలలు గత 40 రోజులుగా పాఠశాలలకు వెళ్లడమేలేదన్న విషయంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ బాలికల నుంచి నేరుగా నేను వాస్తవాలు వినాలనుకుంటున్నాను’ అని మలాల శనివారం టీట్ చేసింది. కశ్మీర్‌లో కుప్వారా, హంద్వారా పోలీసు జిల్లాలు తప్పించి మిగతా ఎక్కడ కూడా మొబైల్స్, ల్యాండ్‌లైన్ ఫోన్లు పనిచేయడంలేదు. రాష్ట్రప్రభుత్వం పాఠశాలలు తెరవాలనుకున్నప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదు. భద్రత కారణాలరీత్యా పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపడంలేదు.