లండన్: భారత్కు తన అప్పగింత ఉత్తర్వుపై అప్పీలుకు అనుమతిని ఇవ్వాలని మద్యం దిగ్గజ వ్యాపారవేత్త విజయ్ మాల్యా పెట్టుకున్న అభ్యర్థనను యుకె హైకోర్టు తిరస్కరించింది. రూ. 9000 కోట్ల మోసం, మనీ లాండరింగ్ కేసులో ఆయనని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కేసు పెట్టింది. ఆయన అప్పగింతకు సంబంధించిన వెస్ట్ మినిష్టర్ కోర్టు ఉత్తర్వుపై బ్రిటన్ హోం సెక్రటరీ సాజిద్ జావీద్ సంతకం చేశారు. కాగా ‘విజయ్ మాల్యా అప్పీలు కోసం పెట్టుకున్న పిటిషన్ను న్యాయమూర్తి విలి యం డేవిస్ ఏప్రిల్ 5న కొట్టేశారు’ అని యుకె న్యాయవ్యవస్థ ప్రతినిధి తెలిపారు. ఈ తాజా తీర్పుతో మాల్యాకు ఎదురు దెబ్బ తగ్గిలిందనే చెప్పాలి. 2016 మార్చి నుంచి యుకెలో ఉంటున్న మాల్యా ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.
యుకె కోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు
RELATED ARTICLES