న్యూఢిల్లీ : భారత దేశం రక్షణ రంగంలో రోజు రోజుకూ బలోపేతమవుతోంది. తాజాగా శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీనిని సుఖోయ్- యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. ఇది శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ఇది శబ్ద వేగం కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళ్ళగలదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) అధికారి ఒకరు తెలిపిన వివరా ల ప్రకారం, వ్యూహాత్మక యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం- డిఆర్‌డిఒ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి దీనిని ప్రయోగించారు. భారత వాయు సేన సుఖోయ్- ఎంకెఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించగలిగే ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ఈ మిసైల్‌తో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీయగలిగే కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం వాయు సేనకు లభించింది. భారత వాయు సేన నిరాటంకంగా, సమర్థవంతంగా తన కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలవుతుంది. యుద్ధ విమానం ప్రయాణించే ఎత్తునుబట్టి ఈ మిసైల్ పరిథి ఆధారపడి ఉంటుంది. కనిష్టంగా 500 మీటర్ల ఎత్తు నుంచి, గరిష్ఠంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీనిని ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల పరిథిలో రేడియేషన్‌ను వెలువరించే లక్ష్యం (రాడార్)ను ఛేదించవచ్చు. రుద్రం- భారత దేశపు మొదటి యాంటీ రేడియేషన్ మిసైల్ కావడం విశేషం.
హర్షం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్
క్షిపణి ప్రయోగం విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘నవతరం యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం- పరీక్ష విజయవంతమైంది. డిఆర్‌డిఒతోపాటు క్షిపణి అభివృద్ధిలో పాల్గొన్న అందరికీ అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు.
వరుస క్షిపణి ప్రయోగాలు
భారత్ మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ వరుస క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే నాలుగు క్షిపణులను పరీక్షించిన భారత్.. నిర్భయ మిసైల్‌ను భారత్- సరిహద్దులకు కూడా తరలించింది. మరోవైపు 700 కి.మీల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమున్న శౌర్య క్షిపణులను సైతం వినియోగించుకునేందుకు మోడీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. అంతేకాకుండా స్మార్ట్ టార్పిడో క్షిపణిని కూడా పరీక్షించింది. వీటితోపాటు హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోనిస్ట్రేటర్ వెహికల్ (హెచ్‌ఎస్‌టిడివి)ని కూడా భారత్ ప్రయోగించింది. ఇది సుదూరాల్లోని లక్ష్యాలను ఛేదించే క్రూజ్ క్షిపణులు, హైపర్ సోనిక్ క్షిపణులను మోసుకెళ్తుంది.
యాంటీ రేడియేషన్ మిసైల్ ‘రుద్రం-1’ ప్రయోగం సక్సెస్
RELATED ARTICLES