రెండో టి20లో ఇంగ్లాండ్ గెలుపు
సిరీస్ 1-1తో సమం చేసిన ఆంగ్లేయ జట్టు
డర్బన్: ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. తొలి టీ20 మ్యాచ్ లాగే చివరి వరకు సాగిన రెండో పోరులో ఈసారి ఇంగ్లాండ్‌పై చేయి సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన రెండవ టీ20లో రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లీష్ బౌలర్ టామ్ కుర్రన్ రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు అద్భుత విజయాన్నిందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (2) మరోసారి విఫలయినా.. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (40) ధాటిగా ఆడాడు. రాయ్ అండతో బెయిర్‌స్టో (35) కూడా రెచ్చిపోయాడు. ఆపై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (27) మెరిశాడు. మొయిన్ అలీ 11 బంతుల్లో 39 పరుగులు చేయగా.. బెన్ స్టోక్స్ 30 బంతుల్లో 47 రన్స్ చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడీ మూడు వికెట్లు తీశాడు. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు తెంబ బవుమా (31), క్వింటన్ డికాక్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా డికాక్ కేవలం 22 బంతుల్లో 65 రన్స్ చేసి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించారు. కొద్ది వ్యవధిలోనే ఓపెనర్లు పెవిలియన్ చేరినా.. డేవి్‌డ మిల్లర్ (21), వాన్ డెర్ డుసెన్ (43) రాణించారు. ఇక ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 15 పరుగులు అవసరం అయ్యాయి.
టామ్ కుర్రన్ సూపర్ బౌలింగ్..
టామ్ కుర్రన్ వేసిన 20వ ఓవర్లోని రెండు, మూడు బంతులను సిక్సర్, ఫోర్ కొట్టిన ప్రిటోరియస్ (25) దక్షిణాఫ్రికాను విజయానికి చేరువ చేసాడు. ఇక నాలుగో బంతికి రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఇక విజయ సమీకరణం 2 బంతుల్లో నాలుగు పరుగులుగా మారింది. ఇదో బంతికి ప్రిటోరియస్ ఎల్బీ రూపంలో ఔట్ అయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండే. కరన్ చివరి బంతిని అద్భుతంగా వేసి ఆదిల్ రషీద్ (0)ను ఔట్ చేసాడు. దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ రెండు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్‌కు ఏడు పరుగులు అవసరమయిన సమయంలో లుంగి ఎంగిడి అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం జరగనుంది. రెండు టీ20లు క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాయి. మూడో టీ20 గెలిచిన జట్టుదే సిరీస్ కాబట్టి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
మోర్గాన్‌సేన ప్రతీకారం తీర్చుకుంది!
RELATED ARTICLES