వచ్చే ఎన్నికల్లో కలసి నడుద్దాం!
ప్రతి నియోజకవర్గంలో బిజెపికి వ్యతిరేక అభ్యర్థి ఎంపిక
అవసరమైతే ముందుగానే ప్రధాని అభ్యర్థిపై ఒక అవగాహన
కాషాయపార్టీని చిత్తుగా ఓడించడమే లక్ష్యం
కోల్‌కతా ‘యునైటెడ్ ఇండియా’ బహిరంగ సభలో బిజెపియేతర పార్టీల నేతల ప్రతిన
కోల్‌కతా : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మూడిందని బిజెపియేతర పక్షాల నేతలు అన్నారు. దేశంలోని కార్పొరేట్, ప్రైవేటు, సంప న్న వర్గాలు మినహాయించి ఇతర అన్ని వర్గాలకు వ్యతిరేకంగా విధానాలు అమలు చేస్తున్న బిజెపి సర్కారును తక్షణమే గద్దె దించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేసి బిజెపిని అధికారానికి దూరం చేయాలని ప్రతిన బూనారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో శనివారం బిజెపియేతర రాజకీయపార్టీలన్నింటినీ ఒకచోట చేరుస్తూ ‘యునైటెడ్ ఇండియా (ఐక్యతార్యాలీ)’ పేరుతో తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు వామపక్షాలు మినహా దాదాపు అన్ని బిజెపియేతర పా ర్టీల నేతలు హాజరయ్యారు. భారీఎత్తున జ రిగిన ఈ బహిరంగసభలో వివిధ పార్టీల నేతలు మోడీ సర్కారు విధానాలను దు య్యబట్టారు. ఈ కార్యక్రమానికి నలుగు రు ముఖ్యమంత్రులు, ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ ప్రధాని, 20 కిపైగా రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు మమతాబెనర్జీ అధ్యక్షత వహించిన ఈ సభకు హాజరైన నేతల్లో కాంగ్రెస్ లోక్‌సభ నేత మల్లిఖార్జున ఖార్గే, అభిషేక్ మను సింఘ్వీ, ఎపి సి ఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి, ఢిల్లీ ము ఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ప్ర ధాని హెచ్‌డి దేవగౌడ (జెడి-ఎస్), శరద్ ప వార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ), అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాది పార్టీ), ఫరూఖ్ అ బ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ఎం.కె.స్టాలిన్ (డిఎంకె), కేంద్ర మాజీ మంత్రులు యశ్వ ంత్‌సిన్హా, అరుణ్‌శౌరి, సోషలిస్టు నేత శరద్ యాదవ్, బిజెపి తిరుగుబాటు నేత శత్రుఘ్నసిన్హా, బిఎస్‌పి ప్రధాన కార్యదర్శి సతీ ష్ చంద్రమిశ్రా తదితరులు వున్నారు. యు పిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, బిఎస్‌పి నేత మాయావతిలు గైర్హాజరయ్యారు. గడిచిన నాలుగున్నరేళ్లలో బిజెపికి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద భేటీ ఇదే కావడం విశే షం. అనంతరం వివిధ పార్టీల అగ్ర నేతలు సమావేశమయ్యా రు. కేంద్రం తీరుకు నిరసనగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేంద్రం తీరుకు నిరసనగా మరిన్ని బహిరంగ సభలకు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. తర్వాత సభ ఢిల్లీలోనా లేక ఆంధ్రప్రదేశ్‌లోనా, కర్ణాటకలో నిర్వహించాలా? అనే అంశంపై చర్చించారు. చివరకు ఢిల్లీ, లేదా అమరావతిలో తదుపరి భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేశారు. కర్ణాటక రాజకీయ పరిణామాలపైనా నేతల మధ్య ప్రస్తావన వచ్చింది. సభల నిర్వహణతో ప్రతిపక్షాలపై మోడీ విరుచుకుపడే అవకాశం ఉందని యూపీ మాజీ సిఎం అఖిలేష్ యా దవ్ అన్నట్టు సమాచారం. పరిధులు దాటి కేంద్రం వ్యవహరిస్తే, జాతీ య స్థాయిలో పోరాడాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఒ కరికొకరు అండగా ఉంటూ మోడీ వ్యూహాలను ఎదర్కోవాలని ఫరూక్ అబ్దుల్లా సూ చించారు. ఆం ధ్రాలో జరుగుతోన్న పరిణామాలను ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు వివరించారు. కొన్ని చోట్ల బిజెపియేతర పార్టీల మధ్యనే విభేదాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో వాటిని పరిష్కరించుకోవాలని, అలాగే, పరిస్థితిని బట్టి ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని కూడా ప్రకటించాలని కొంతమంది నేతలు ప్రతిపాదించారు. ప్ర తి ని యోజకవర్గంలోనూ బిజెపికి వ్యతిరే క, బలమైన, ఉమ్మడి అభ్యర్థిని ఇప్పటి ను ంచే ఎంపిక చేసి, నిలబెట్టాలని పేర్కొన్నా రు. ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’నినాదం తో యుపిలో ఎస్‌పి, బిఎస్‌పిలు చేతులు కలిపినట్లుగా ఇతర బిజెపియేతర పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.