కెసిఆర్‌కు సురవరం సుధాకర్‌రెడ్డి సూటిప్రశ్న
ప్రజాపక్షం/హైదరాబాద్ : కేంద్రంలో మోడీ అనుసరించిన ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు ఏనాడైనా నోరు విప్పారా అని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కెసిఆర్ బిజెపికి బి–టీమ్ అనడానికి ఇంతకన్నా నిదర్శనాలేముంటాయని అన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన బీఫ్ అంశం, మతమౌఢ్యు లు మేధావులను హత్యచేయడం, ఎవరు ఏ భోజనం తినా లో, ఎవర్ని పెళ్లి చేసుకోవాలో చెప్పడం, నోట్లరద్దు, జిఎస్‌టి వంటి ఎన్నో సమస్యలపై కెసిఆర్ మద్దతునివ్వడం లే దా మౌనంగా వున్న పూర్వరంగంలో సురవరం ఈ వ్యాఖ్య లు చేశారు. దేశంలో అధికారంలో ఉన్న అర్థ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా వస్తున్న విశాలమైన ఐక్య వేదికను విచ్ఛి న్నం చేసే పనిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. సిపిఐ 93వ వార్శికోత్సవం సందర్భంగా బుధవారం మఖ్దూంభవన్‌లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సురవరం ప్ర సంగిస్తూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంతిర గత మూడు నాలుగు రోజులుగా వివిధ రాష్ట్రాల ము ఖ్యమంత్రులను కలిసి తమ బాస్ నరేంద్ర మోడికి నివేదికను సమర్పించబోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. బి జెపి వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ అని టిఆర్‌ఎస్ నా యకులు చెబుతున్నారని, అదే నిజమైతే గత నాలుగున్నర సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎందుకు బలపరిచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టిని బలపరుచలేదా? పార్లమెంటులో ఆవిశ్వాసతీర్మానాన్ని అనుకులంగా వ్యవహరించలేదా? అని ప్రశ్నించారు. మోడి పాలనలో జరిగిన అకృత్యాలు, ముస్లిం మైనారిటీలపై హత్యాకాండ, మేధావులపై జరిగిన వేట, దళితులపై జరిగిన దారుణమైన హింసకాండపై ఒక్కదాన్నైనా ఖండించారా? అని ప్రశ్నించారు. ఈ రోజు ఇద్దరికి వ్యతిరేకమని ఎవరిని మోసం చేయడాని కి ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. ఇలాంటి నాటకాలను ప్రజలు గుర్తిస్తారన్నారు.