కోల్‌కతాలో ‘గో బ్యాక్’ నినాదాల హోరు
ఆందోళనల మధ్యే బెంగాల్ పర్యటనకు విచ్చేసిన ప్రధాని
కోల్‌కతా: ‘గో బ్యాక్’ నినాదాలు, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం నగరంలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జగదీప్ ధన్‌కర్, నగర మేయర్, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖమంత్రి ఫిర్హాద్ హకీం, పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్, పార్టీ ఇతర సీనియర్ నాయకులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం హాజరు కాలేదు. అయితే ప్రధాని నగరానికి చేరుకున్న సమయంలో రాష్ట్రం లో సిఎఎకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. కోల్‌కతా విమానాశ్రయం వన్ క్రాసింగ్ గేట్ నెంబర్ వెలుపల వందలాదిమంది నిరసనకారులు నల్లజెండాలను ఎగురవేశారు. వారిని ఎయిర్‌పోర్టు వైపు వెళ్లనీయంగా అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాగా, ప్రధాని ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో రాయల్ కలకత్తా టర్ఫ్ క్లబ్ (ఆర్‌సిటిసి)కి, అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అదిలా ఉండగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అధికార తృణమూల్ కాం గ్రెస్ విద్యార్థుల విభాగం, లెఫ్ట్‌ఫ్రంట్ కార్యకర్తలు వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థుల విభాగమైన టిఎంసిపి సిఎఎ, ఎన్‌ఆర్‌సి, జాతీయ జనాభా జాబితాకు వ్యతిరేకంగా కోల్‌కతాలో రాణి రష్మోని రోడ్ వద్ద శుక్రవారమే ధర్నాను నర్వహించారు.
మోడీకి నిరసనల సెగ
RELATED ARTICLES