ఆటోను ఢీకొన్న డిసిఎం : ఆరుగురు మృతి
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ప్రజాపక్షం/ములుగు జిల్లా ప్రతినిధి
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం సంభవించింది. అన్నారం దర్గా మొక్కులు చెల్లించుకుని తిరిగి వస్తున్న క్రమంలోఆటోను డిసిఎం ఢీ కొట్టింది. ములుగు జిల్లా వెంకటపూరం మండలంలోని హరిత హోటల్ సమీపంలో ఎర్రి గట్టమ్మ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్‌తోసహా మొత్తం 8 మంది ప్రయాణం చేస్తున్నారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యరు. వారిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మంగపేట మండలం కోమటిపల్లి కెసిఆర్ కాలనీకి చెందినవారు. నాలుగు కుటుంబాలకు చెందిన వీరు ప్రభుత్వం డబుల్‌బెడ్ రూమ్‌లు కేటాయించడంతో అన్నారం దర్గాకు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో చెలమల కిరణ్ (16) బోల్లె అజయ్ (12), కౌసల్య (60), తూనికి జాని (23), బోల్లె రసూల్ (46), బోల్లె వెన్నెల (23) మరణించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజియంకు తరలించగా చికిత్స పొందుతూ బోల్లె వసంత, బోల్లె వెన్నెల మరణించారు. అర్ధర్రాతి 2 గంటల సమయంలో ఎర్రి గట్టమ్మ హరిత హోటల్ సమీపంలో పశువులతో వస్తున్న డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. కోమటిపెల్లికి చెందిన వారు మరణించడంతో గ్రామంలో విషాధం నెలకొంది. ప్రమాదం విషయం తెలుసుకున్న ములుగు ఎంఎల్‌ఎ సీతక్క ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డిఎంఎచ్‌ఒ అప్పయ్యకు సుచించారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను కోమటిపెల్లికి తరలించనున్నట్లు తెలిసింది.