ఇద్దరి అరెస్టు, రూ.2 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
హైదరాబాద్ : మైసూర్ నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ అవుతోంది. కొంతకాలంగా ఎవరి కంట పడకుండా నడుస్తున్న ఈ తంతును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు బ్రేక్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో డిఆర్‌ఐ అధికారులు శనివారం ఈస్ట్‌మారెడ్‌పల్లిలోని ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి ఆవరణలో పార్కింగ్‌లో ఉన్న రెండు కార్లను తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్ల విలువైన రూ.1.99 కోట్ల విలువైన నాలుగు కిలోల (40 బిస్కెట్లు) స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేయగా మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ బంగారంకు సంబంధించి ఎలాంటి అర్హత పత్రాలు లేవని డిఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. నిందితుల విచారణలో ఈ బంగారం మైసూర్ నుంచి తీసుకువచ్చినట్లు తేలింది. మైసూర్ కేంద్రంగా దేశ వ్యాప్తంగా బంగారం స్మగ్లింగ్ అవుతున్నట్లు విచారణలో బయటపడింది. హైదరాబాద్‌కు తీసువచ్చే బంగారం విదేశాల నుంచి అక్రమంగా తరలించిందేనని విచారణలో వెల్లడైంది. ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరి హస్తం ఉంది అనే అంశంపై డిఆర్‌ఐ అధికారులు దృష్టి సారించారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను కూడా త్వరలో అరెస్టు చేసి తీరుతామని వెల్లడించారు.
మైసూర్ టు హైదరాబాద్ గోల్డ్ స్మగ్లింగ్
RELATED ARTICLES