బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది. దేశంలోనే దసరా ఉత్సవాలకు ప్రఖ్యాతి గాంచిన మైసూరులో ‘దసరా యువ క్రీడల’ ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పతో కలసి పోటీల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కర్ణాటక దసరా ఉత్సవాలతో పాటు, దసరా యువ క్రీడలను ప్రారంభించాల్సిందిగా సింధును ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప కొద్ది రోజుల కిందట ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు మైసూరు చేరుకున్న పీవీ సింధు సీఎం యడియూరప్పతో కలసి దసరా యువ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత సింధును యడియూరప్ప సన్మానించారు. గత ఆగస్టులో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహరను 21–7, 21–7 తేడాతో ఓడించింది.
మైసూరులో ‘దసరా క్రీడల’ను ప్రారంభించిన స్టార్ షట్లర్ సింధు
RELATED ARTICLES