ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
ప్రజాపక్షం/ సూర్యాపేట బ్యూరో: అక్రమ సంపాదనే లక్ష్యంగా సూర్యాపేట జిల్లాలో మైనింగ్ మాఫియా కొంత కాలంగా రెచ్చిపోతోంది. ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఖనిజాలను దోచుకుతింటున్నారు. ప్రభుత్వ నిబంధనలు భేతాఖర్ చేస్తూ అడ్డగోలుగా భూగర్భ సంపదను వెలికితీస్తున్నారు. దీంతో పర్యావణానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రభుత్వ ఆదాయనికి భారీగా గండి పడుతోంది. సంబంధిత అధికారుల కనుసైగల్లోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికారుల తీరుపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 12న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మైనింగ్ అధికారులు సమర్పించిన నివేదికపై ప్రజాప్రతినిధులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. నివేదికలో పొందపర్చిన పలు అంశాలపై అధికారులు ప్రశ్నించగా వాళ్లు సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో కోదాడ శాసనససభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గోపగాని వెంకటనారాయణ గౌడ్‌లు సంబంధిత అధికారులు తీరుమార్చుకోకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించడం గమనార్హం.
సూర్యాపేట జిల్లాలో భూగర్భ సంపదకు కొదవలేదు. సున్నపు రాయి నిక్షేపాలు హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఘననీయంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 13 సిమెంట్ పరిశ్రమలు వెలిశాయి. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన సున్నపురాయి ఎంతో అవసరం. కాగా అక్కడి సిమెంట్ పరిశ్రమల నిర్వాహకులు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసి వాటిని వెలికితీయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములను కూడా లీజుకి తీసుకొని సిమెంట్ ఉత్పత్తులు చేస్తున్నారు. సున్నపు రాయి నిక్షేపాలు ఉన్న భూముల్లో పెద్ద తరహా ఖనిజాలు (సున్నపురాయి) ఉన్నవి 35 ఉండగా. 20 పని చేస్తున్నాయి. చిన్న తరహా ఖనిజాలు ఉన్న నలుపురాయి, షెల్, లేటరైట్, బ్లాక్ అండ్ కలర్స్ గ్రానైట్, రోడ్డు మెంటల్, బిల్డింగ్ స్టోన్, నాపరాయి. మోసయిక్ చీప్స్, క్వార్టజెట్, నిక్షేపాలు మరో 120 దాక ఉన్నాయి. పెద్ద తరహా నిక్షేపాలను కంపెనీల యాజమాన్యాలు తమ సొంత భూములో వెలికితీస్తుండగా చిన్న తరహా పరిశ్రమల వారు కౌలుపై ఆదారపడి నడుపుతున్నారు. వీటి ద్వారా ప్రభుత్వానికి 2019-20202 ఆర్ధికసంవత్సరంలో రూ. 11,761.91 లక్షలు కాగా డిసెంబర్ నాటికి అధికారులు రూ. 93,23.62లక్షలు వసూల్ చేశారు. మైనింగ్ క్వారీ లీజుల నుండి డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు కింద మరో రూ. 144,14,71,698 వసూలు చేయడం జరిగింది. ఇంత వరకు భాగానే ఉన్న అధికారులు మాత్రం పరిశ్రమల నిర్వాహకులతో మిలాఖత్ అయి లీజుకు ఇచ్చింది కొంతనే అయితే కొండంతా తవ్వకాలు జరుపుతూ ఖనిజా సంపదను దోచుకుంటున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తు వెల్లువెత్తున్నాయి. పరిశ్రమలతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున వాగు లు, వంకలు ఉండటంతో ఇసుక కూడా సంవృద్దిగా లభ్యమవుతుంది. జిల్లాలోని అర్వపల్లి, తిరుమలగిరి, సూర్యాపేట, పెన్‌పహాడ్, మోతె, ఆత్మకూర్(ఎస్), నూతనకల్ పరిధిలో మూసీ, పాలేరు, క్రిష్ణా పరివాక ప్రాంతాలు బిక్కెరు వాగులాంటివి ఉండటంతో ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఉన్నాయి. వీటిని మైనింగ్ శాఖ లీజులకు ఇవ్వ డం జరిగింది. పర్యావరణాన్ని ముప్పు వాటిల్ల కుండా హద్దులు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. లీజు కు తీసుకున్న నిర్వాహకులు నిబంధనల మేరకు కాకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతూ ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్న పరిస్ధితులు ఉన్నాయి.