ముంబయి: భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌కు సంబంధించి 10 మంది అంబాసిడర్లలో మేరీకోమ్‌కు చోటు దక్కింది. మహిళల అథ్లెట్ల విభాగంలో ఆసియా నుంచి మేరీకోమ్‌ను అంబాసిడర్‌గా నియమించారు. ఆరుసార్లు వరల్ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ ఐదుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌ను గెలిచారు. 51 కేజీల విభాగంలో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం కూడా సాధించారు. దీంతో మేరీకోమ్‌ను ఆసియా నుంచి మహిళల అథ్లెట్ల విభాగంలో అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) నిర్ణయం తీసుకుంది.
టోక్యో ఒలింపిక్స్ అంబాసిడర్లు వీరే..
లుక్మో లావల్(ఆఫ్రికా), జులియో సీజర్ లా క్రూజ్(అమెరికా), జియాన్‌గుయాన్ ఆసియాహు(ఆసియా), వాస్లీ లామాచెన్‌కో(యూరప్), డేవిడ్ యికా(ఒసినియా), ఖదిజా మార్ది(ఆఫ్రికా), మికియెలా మేయర్(అమెరికా), మేరీకోమ్(ఆసియా), సారా ఓరామౌన్(యూరప్), షెల్లీ వాట్స్(ఒసినియా)
మేరీకోమ్‌కు అరుదైన గౌరవం
RELATED ARTICLES