కాళేశ్వరంలో మరో కీలక మార్పు
అదనంగా మోటార్లు, లిఫ్ట్‌లు
పెరగనున్న అంచనా వ్యయం
సిఎం వద్దకు చేరిన ప్రతిపాదనలు
ఇప్పటికే రెండు టిఎంసిలు ఎత్తిపోసేలా పనులు
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గత ఐదేళ్లుగా ఎన్నెన్నో మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ రోజు ఉన్న డిజైన్ మరో రోజుకల్లా మారడం జరుగుతూనే ఉంది. నీటి మళ్లింపు, రిజర్వాయర్ల సామర్థ్యాల పెంపు ఇలా ఎన్నో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఇది కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరుగుతున్నట్లు నీటి పారుదల శాఖాధికారులు తెలిపారు. ఇప్పుడున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రకారం మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోసేలా పనులు చేపట్టారు. ఇది సరిపోదని రోజుకు మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి తాజాగా నిర్ణయించారు. దీని కోసం ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్లు ఏర్పా టు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అంచనాలను నీటిపారుదల శాఖాధికారులు సిద్ధం చేసి సిఎం వద్దకు పంపించారు. ప్రస్తుతం రెండు టిఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు మేడిగడ్డ పంప్‌హౌస్ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 పంప్‌లు ఏర్పాటు చేశారు. మూడో టిఎంసి ఎత్తిపోయాలంటే ఈ మూడు పంప్‌హౌస్‌లకు కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు వేశారు. అదనంగా ఏర్పాటు చేసే ఈ మోటార్లలో మేడిగడ్డలో ఆరు, అన్నారంలో నాలుగు, సుందిళ్లలో ఐదు మోటార్లు ఏర్పాటు చేయాలి. దీంతో అంచనా వ్యయం కూ డా పెరుగుతోంది. ప్రస్తుతం ( రెండు టిఎంసిల లెక్క ప్రకారం) మేడిగడ్డ పంప్‌హౌస్ అంచనా వ్యయం రూ.3524 కోట్లు కాగా, మూడో టిఎంసి కోసం చేయాల్సిన పనుల కారణంగా దీని అంచ నా వ్యయం రూ.4966 కోట్లకు పెరుగుతోంది. అలాగే అన్నారం అంచనా వ్యయం రూ.2140 కోట్ల నుంచి రూ.3810 కోట్లకు, సుందిళ్ల అంచ నా వ్యయం రూ. 2334 కోట్ల నుంచి రూ.3616 కోట్లకు పెరుగుతోంది. అంటే మూడు పంప్‌హౌస్‌లకు కలిపి గత అంచనా వ్యయం రూ.7998 కోట్లు ఉండగా, మూడు టిఎంసిల సామర్థ్యానికి మార్చడం వల్ల అంచనా వ్యయం రూ.12392 కోట్లకు పెరుగుతోంది. ఈ పంప్‌హౌస్‌ల ద్వారా ఎల్లంపల్లికి వచ్చే నీటిని మిడ్‌మానేరు వరకు తరలించేందుకు ఆప్రోచ్ చానల్, గ్రావిటీ కాల్వ, టన్నెళ్ల నిర్మాణాలకు అదనంగా మరో 10500 కోట్లు అవుతాయని అంచనా వేశారు. మిడ్ మానేరు నుంచి