ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత యువ సంచలనం లక్ష్యసేన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మరోవైపు భారత స్టార్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, అజయ్ జయరామ్ క్వాలిఫయింగ్ మ్యాచుల్లోనే ఓడి ఇంటి ముఖం పట్టారు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో 17 ఏళ్ల లక్ష్యసేన్ 21 21 తేడాతో మలేసియాకు చెందిన తెక్ జి సూను వరుస గేమ్‌లలో చిత్తు చేసి మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మొదటి గేమ్ నుంచే దూకుడు ప్రదర్శించిన లక్ష్యసేన్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వరుసగా రెండు గేమ్‌లలో గెలుపును ఖాయం చేసుకున్నాడు. అంతకుముందు తన తొలి క్వాలిఫాయింగ్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ భారత్‌కే చెందిన టాప్ సీడ్ ఆటగాడు జయరామ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో సేన్ 21 21 జయరాంను చిత్తు చేశాడు. మరో పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ పారుపల్లి కశ్యప్ తన క్వాలిఫాయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 21 21 ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్ యాన్‌పై విజయం సాధించాడు. కానీ రెండో రౌండ్ మ్యాచ్‌లో కశ్యప్ 16 18 తేడాతో సున్ ఫెక్సియాంగ్ (చైనా) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
నేటి నుంచే మెయిన్ డ్రా పోటీలు..
ఇక బుధవారం నుంచి మెయిన్ డ్రా పోటీలు జరగనున్నాయి. మెయిన్ డ్రాలో యువ ప్లేయర్ లక్ష్యసేన్‌కు కఠినమైన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు. లక్ష్యసేన్‌కు తన తొలి రౌండ్‌లో వాంగ్ జు వీ (చైనీస్ థైపీ)తో తలపడనున్నాడు. మరోవైపు భారత స్టార్ మహిళా షట్లర్, రెండో సీడ్ సైనా నెహ్వాల్ తన తొలి రౌండ్ మ్యాచ్‌లో చైనా ప్రత్యర్థి వాంగ్ జియిను ఢీ కొననుంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ ఎస్ ప్రణయ్ సింగపూర్‌కు చెందిన లో కీన్ యితో, సాయి ప్రణీత్ భారత్‌కే చెందిన సుబంకర్ దేతో తలపడనున్నారు.
మెయిన్ డ్రాకు లక్ష్యసేన్
RELATED ARTICLES