సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సింగపూర్: హైదరాబాద్ స్టార్ షట్లర్ పా రుపల్లి కశ్యప్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ నుంచి యువ క్రీడాకారిణి ముగ్దా కూడా మెయిన్ డ్రా పోటీలకు అర్హత సాధించిం ది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫాయింగ్ రెండో గేమ్‌లో పారుపల్లి కశ్యప్ (భారత్) 15 21 22 తేడాతో జా పాన్‌కు చెందిన యు ఇగ్రాషిపై గెలిపొందాడు. తొలి గేమ్‌లో ఓటమిని చవిచూసిన కశ్యప్ తర్వాతి గేమ్‌లలో అద్భుతం గా పుంజుకున్నాడు. జపాన్ ప్రత్యర్థిని వరుస గేమ్‌లలో ఓడించి మెయిన్ డ్రా బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఇక మెయి న్ డ్రా తొలి రౌండ్‌లో కశ్యప్ డెన్‌మార్క్ స్టార్ రస్ముస్ గెమ్కెతో తలపడనున్నాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో కశ్యప్ 21 14 21 జున్ వి చీమ్ (మలేసియా)ను ఓడించా డు. మహిళల విభాగంలో జరిగిన క్వాలిఫాయింగ్ పోటీల్లో ముగ్దా (భారత్) 16 21 21 తేడాతో అమెరికాకు చెందిన లౌరెన్ లామ్‌పై విజయంసాధించింది.
మెయిన్ డ్రాకు కశ్యప్
RELATED ARTICLES