హైదరాబాద్ : కరోనా వైద్యం చేసేవాళ్లకు పిపిఇ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్స్ మొదౖలñ నవన్నీ అందజేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు, గ్లౌజులు వంటివి అన్నీ తగినన్ని ఉన్నాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. అవన్నీ కావాల్సినన్ని లేవని పిటిషనర్లు ప్రతివాదన చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ బీఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ బెంచ్ కల్పించుకుని, అవన్నీ ఎన్ని ఉన్నాయో, ఎన్ని కావాలో ఆయా హాస్పటల్స్ సూపరిటెండెంట్ల నుంచి రిపోర్టులు తెప్పించుకుని పూర్తి వివరాలు ప్రభుత్వం అందజేయాలని ఆదేశించింది. కేరళ, ఏపీల్లో ర్యాపిడ్ యాక్షన్ కిట్లను వినియోగిస్తే పావు గంటలోనే టెస్ట్ ఫలితాలు ఉంటాయని పిటిషనర్ లాయర్లు చెప్పారు. ఈ కిట్లను తెలంగాణ లో ఎందుకు వాడటం లేదని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో 9 ల్యాబ్స్‌లో ఒక రోజుకు 4 వేల పరీక్షలు జరుగుతున్నందున అవి అవసరం లేదని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ డైరెక్టర్ శంకర్ జవాబు చెప్పారు. విచారణ వచ్చే నెల 6కి వాయిదా పడింది
రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది వరకూ వలస కార్మికులు ఉన్నారని, ఒక సర్వే ప్రకారం మూడు లక్షల 35 వేల మంది ఉంటారని, అయితే 2 లక్షల మందికి షెల్టర్లల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సర్కార్ తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, రాష్ట్రంలోని సుమారు మూడు లక్షల 35వేల వలస కార్మికులను గుర్తిస్తే అందులో 2 లక్షల మంది షెల్టర్లలో ఉన్నారని తెలిపారు. వసతి, భోజన ఇతర వసతులు కల్పించామని చెప్పడంతో మిగిలిన లక్ష మంది గురించి వివరించాలని ఆదేశించిన హైకోర్టు రెండు లక్షల మందికిపైగా వలస కార్మికులు ఎక్కడున్నారో, వారెలా ఉన్నాయో ప్రభుత్వం పూర్తి వివరాలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్ వల్ల వాళ్లు ఎక్కడికీ వెళ్లలేరని, వారి జీవనపరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం సర్కార్‌ను ఆదేశించింది. వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీయంగా ఉన్నాయని, ఉపాధి లేదని, సొంతూరు వెళ్లలేకపోతున్నారని పిటిషనర్ న్యాయవాది ప్రభాకర్ చెప్పారు. వలస కార్మికులను ఆదుకునే సర్కార్‌కు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కామారెడ్డిలో ఇద్దరు వలస కార్మికులు చనిపోయారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. విచారణను మే 6కి వాయిదా పడింది.
మెడికల్ సిబ్బందికి మాస్కులు అందుతున్నాయా?
RELATED ARTICLES