రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్
సంగారెడ్డిజిల్లా సూల్తాన్‌పూర్‌లో ‘ప్రాజెక్ట్ సంజీవని’ ప్రారంభం
\ప్రజాపక్షం/ సంగారెడ్డి మెడికల్ డివైస్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసే లక్ష్యంగా పనిచేస్తామని, మెడ్‌టెక్ రంగంలో తెలంగాణ ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహిస్తుందని, పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖమంత్రి కె.తారకరామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం సుల్తాన్ పూర్‌లోని మెడికల్ డివైస్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రాజెక్ట్ సంజీవని’ మొదటి దశను శుక్రవారంమంత్రి కెటిఆర్ ప్రా రంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం సుల్తాన్‌పూర్ డివైస్ పార్క్‌లో ప్రారం భం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపం చ స్థాయిలో సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్కు పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంటుందనే నమ్మకముం ఉందన్నారు. కొవిడ్ సమయంలో కూడా ఎస్‌ఎంటి సంస్థ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. మెడికల్ ఉత్పత్తులు 80 శాతంపైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఆ పరిస్థితికి పార్కు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. మన దేశంలో మెడికల్ డివైస్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎస్‌ఎంటి సంస్థలో తయారుచేసే మెడికల్ డివైస్‌లు 70 దేశాలకు ఎగుమతి కానున్నాయన్నారు. తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ కానున్నదని తెలిపారు. సుమారు 9 మిలియన్ డోసులు ఉత్పత్తి చేసామన్నారు. సుల్తాన్ పూర్ మెడికల్ డివైస్ పార్కులో ఇప్పటికే ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టి తమ ఉత్పత్తులను ప్రారంభించాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
మెడికల్ డివైస్ ఇండస్ట్రీ అభివృద్ధే లక్ష్యం
RELATED ARTICLES