సుల్తాన్‌పూర్‌లో పనులు ఇంకా పునాదుల దశలోనే
శంకుస్థానన చేసి రెండేళ్లు.. 14 కంపెనీలతో ఎంఒయుకే పరిమితం
ఆశగా ఎదురుచూస్తున్న ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన మెడికల్ డివైజెస్ పార్కు పనులు నత్తనడకను గుర్తు చేస్తున్నాయి. 2017 జూన్ 16న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, ఆ జిల్లా మంత్రిగా ఉన్న హరీష్‌రావు తదితరులతో కలి సి శంకుస్థాపన చేసిన విషయం తె లిసిందే. పార్కు శంకుస్థాపన సభ లో మంత్రి కెటిఆరే ఈ పార్కును రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇ చ్చారు. పరిశ్రమలశాఖ అధికారు లు మాత్రం 2019 నాటికల్లా సిద్ధం చేస్తామని సెలవిచ్చారు. మెడికల్ డివైజెస్ పార్కు శంకుస్థాపనను పురస్కరించుకుని 14 కంపెనీలు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రూ. 425 కోట్ల పెట్టుబడులతో4000 మందికి ప్రత్యక్షంగా, 8000 మం దికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చా యి. అపోలో హాస్పిటల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ ఫిర్మ్ సయ్యంట్ లిమిటెడ్ తదితర కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్న జాబితాలో ఉన్నాయి. 250 ఎకరాల్లో మెడ్ టెక్ ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్షరింగ్ జోన్‌గా మారుతుందని ప్రభు త్వం హామీ ఇచ్చింది. మెడికల్ డివైజెస్ రంగంలోనూ, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ మెడికల్ ఇన్నోవేషన్ రంగంలోనూ , ఆర్ అండ్ డి, మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనూ అతిపెద్ద ఫెసిలిటి కేంద్రంగా ఆవిర్బవించనుందని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. ఇప్పటికే దక్షిణ కొరియాలోని గ్వాంజులో ప్రసిద్ధ మెడికల్ డివైజెస్ పార్కు ఒక టి ఉందని, సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసే ఈ పార్కు కోసం ఎలా ముందుకెళ్లాలన్నదానిపై పరస్పరం మోధోసంపత్తిని బదిలీ చేసుకుని ముందు కు సాగుతామని నాటి మంత్రి కెటిఆర్ చెప్పారు.
ఆశగా చూస్తున్న ఫిక్కీ
సుల్తాన్‌పూర్ మెడికల్ ఉపకరణాల పార్కు అందుబాటులోకి తీసుకువస్తే మహిళా పారిశ్రామిక వేత్తలకు అందులో భాగస్వామ్యం లభించనుందని ఫిక్కీ మహిళా పారిశ్రామిక వర్గాలు భావించాయి. నిజానికి ప్రభుత్వం ఈ 250 ఎకరాల పార్కులో ఫిక్కీ కోసం 50 ఎకరాలను కేటాయించింది. పటాన్ చెరువు సమీపంలోని సర్వే నెంబర్ 174 & 70 లలో 557.32 ఎకరాల భూమిలో 142.85 ఎకరాలను తొలి దశ కింద మెడికల్ డివైసెస్ పార్కు కోసం ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ( లెటర్ తేది 17/06/2017 ప్రిన్సిపుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ) 14 కంపెనీలకు ప్రతిపాదన ఉత్తర్వులను ఇచ్చింది). ఈ 14 కంపెనీల అంచనా పెట్టుబడి విలువ రూ. 416.59 కోట్లుగా వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో యూనిట్లు కార్యాచరణలోకి తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అది హామీగానే మిగిలి పోయింది. శంకుస్థాపన వేసి రెండేళ్లు గడిచి పోయినా ఇంకా మౌళిక సదుపాయాల అభివృద్ది కార్యక్రమాలు మాత్రం పునాది దశలోనే ఉండడంతో పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన కంపెనీలు, తమకు ఉపాధి లభిస్తుందని గంపెడాశతో నిరీక్షించిన నిరుద్యోగ యువత తీవ్ర నిరుత్సాహానికి గురువుతున్నారు. ఇందులో కనీసం 200 మెడికల్ డివైజెస్ ఉపకరణాల సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పుకుంటే ఇక స్థలం చాలని పరిస్థితి ఉత్పన్నం కానుందని, ఈ కారణంగా ఈ పార్కును 400 ఎకరాలకు విస్తరించే ప్రతిపాదనతో ప్రభుత్వం వద్దకు వెళ్తామని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గతంలో ఒక సందర్భంలో పేర్కొనడం గమనార్హం.
మెడికల్ డివైజెస్ పార్కు జాడేదీ?
RELATED ARTICLES