పరిశ్రమ ఏర్పాటును మరిచిన రాష్ట్ర సర్కార్
జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో 117 ఎకరాల ప్రతిపాదనతో సరి
పరిశ్రమ పనులు వేగవంతం చేయాలంటున్న తోళ్ల పరిశ్రమ వర్గాలు
ప్రజాపక్షం/హైదరాబాద్: తోళ్ల పరిశ్రమ రాష్ట్రంలో ఇప్పటికే కుటీర పరిశ్రమగా విరాజిల్లుతోంది. అక్షరాస్యత లేకున్నా తోళ్లను అందంగా తీర్చిదిద్ది ప్రజల దైనందిన జీవనంలో వినియోగించుకునే అనేక అద్భుత వస్తువుల రూపకల్పన రాష్ట్ర తోళ్ల పరిశ్రమ రంగ కార్మికుల సొంతం. పశువులను అదిలించేందుకు చెర్నకోల, వ్యవసాయ రంగ పనిముట్లు, కాళ్ల జోళ్లు, షూస్ మొదలుకొని రంగు రంగుల హ్యాండ్ బ్యాగ్స్, పర్స్‌లు , బెల్టులు తదితర వస్తువులన్నీ లెదర్ సొంతమే. అంతెందుకు ఈ రోజుల్లో లెదర్‌ను వినియోగించుకుని తయారు చేయని వస్తువంటూ లేదన్న పరిస్థితికి ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్ వచ్చేసింది. పారిశ్రామిక తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటూ పేర్కొన్న ప్రభుత్వం మూడేళ్ల క్రితం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్, జనగామ వద్ద ఇంటర్ నేషనల్ లెదర్ క్లష్టర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తెలిపింది. అంతే కాకుండా స్టేషన్ ఘన్ సమీపంలో ( సర్వే నెంబర్లు 503, 504లలో) 117 ఎకరాల భూమిని ప్రతిపాదించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 270 కోట్లు కాగలదని అప్పట్లో తెలంగాణ పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్థ ( టిఎస్ఐఐసి) అంచనా కూడా వేసింది.సదరు సర్వే నెం బర్లలోని ప్రతిపాదిత భూమిని మెగా లెదర్ క్లష్టర్ కోసం స్వాధీనం చేసుకునేందుకు అప్పటి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.ఈ 270 కోట్ల మొత్తంలో కేంద్రం ప్రభుత్వం వాటాగా రూ.105 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఇండియన్ లెదర్ డెవలప్మెంట్ ప్రొగ్రాం కింద కోరిం ది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ మేరకు నిధుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కేంద్రం ఈ లెదర్ క్లష్టర్ కు సంబంధించిన పూర్తి డిపిఆర్ ( వివరణాత్మక నివేదిక)ను కోరింది.ఈ డిపిఆర్‌ను రూపొందించే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ ( ఎంఎస్ గ్రాండ్ థోర్టాన్)ను నియమించుకున్నప్పటికీ ఆ నివేదిక పురోగతి ఎంత వరకు వచ్చిందో ఎవరికీ తెలియడం లే దు. ఈ లోగా తెలంగాణకు ముందస్తు ఎన్నిక లు రావడంతో ప్రభుత్వం ఈ మెగా లెదర్ క్లష్టర్‌ను పూర్తి గా మరిచిపోయినట్లుందని తోళ్ల పరిశ్రమ కార్మికులు,సంస్థలు ఆరోపిస్తున్నారు.ఎన్నికల్లో రెండో సారి కూడా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాని చ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ