ఢిల్లీలో కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష పార్టీల నేతలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం మెగా ర్యాలీ నిర్వహించింది. ఇందులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సహా అనేక మంది ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. వారంతా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన బిజెపిని ఓడించాలని విరుచుకుపడ్డారు. ఈ ర్యాలీ కి దాదాపు మూడు వారాల క్రితం జనవరి 19న మమతా బెనర్జీ కూటా ఇలాంటి ప్రతిపక్ష్య ర్యాలీనే నిర్వహించారు. ఈ ర్యాలీలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు డి.రాజా ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పార్లమెంటును బలహీనపరుస్తున్నారని అన్నారు. ‘హిట్లర్ రీచ్‌స్టాగ్(జర్మనీ పార్లమెంటు)ను అణగదొక్కినటువంటి పరిస్థితిని ఇక్కడ కూడా మీరు అనుమతిస్తారా?’ అన్నా రు. ‘రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అధికారంలో ఉన్న బిజెపి ముప్పుగా మారింది’ అన్నా రు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి దేశం లో రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతోందన్నారు. భారత దేశాన్ని లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర దేశంగా నిర్వచించారు. అయితే బిజెపి సిద్ధాంతం మాత్రం ‘మత తత్వం,కుల తత్వం,విభజించడం’ అన్న వాటిపై ఉందన్నారు. ఫాసిస్టు శక్తులు ఎప్పుడైతే అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటారో అప్పుడు వా రు రాజ్యాంగ సంస్థలను నాశనం చేస్తారు. నేను సిబిఐ, ఆర్బిఐ గురించి మాట్లాడ్డం లేదు… పార్లమెంటు సంస్థలను బలహీనపరిచారు. పార్లమెంటును లెక్కచేయడంలేదు. పార్లమెంటు పాత్రను తక్కువ చేస్తున్నారు. గరిష్ఠంగా మోడీ..కనిష్ఠంగా పార్లమెంటు ఉండేలా చేస్తున్నారు’ అన్నారు. జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ఈ ర్యాలీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, ఆప్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, నేషనల్ కానరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, లోక్ తాం త్రిక్ జనతాదళ్ నాయకడు శరద్ యాదవ్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, డిఎంకె ఎంపి కనిమొళి, సిపిఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ తదితర నాయకులు ప్రసంగించారు. సిపిఐ(ఎం) నాయకుడు సీతారామ్ ఏచూ రి ప్రసంగిస్తూ ‘ బిజెపి దుశాసనుడి రాజకీయాలు నడుపుతోంది, అన్నదమ్మలను చీలుస్తోంది. మెరుగైన భారత్ కోసం ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సి ఉంది. దేశాన్ని కాపాడుతానన్న ఈ చౌకీదార్‌ను తొలగించాల్సి ఉంది. బిజెపి కౌరవ సేనలా ఉంది. పాండవుల ఉన్న ప్రతిపక్షం దేశాన్ని రక్షించడానికి వారిని ఓడించాల్సి ఉంది’ అన్నారు. గమనించాల్సిన విషయమేమిటంటే మమతా బెనర్జీ రాడానికి కొద్ది నిమిషాల ముందే వామపక్షనాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేజ్రీవాల్ మాట్లాడు తూ ‘మోడీ రాజ్యాంగాన్ని చింపేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఓ ప్రధాని గా మోడీ రాఫెల్ ఒప్పందంపై నిజాలేమిటో చెప్పాలి, జాతికి జవాబుదారి కావాలి’ అన్నారు. బెంగాల్లో ఎన్నికైన ప్రభుత్వంపై దాడి చేయడానికి ఢిల్లీ నుంచి 40 మంది సిబిఐ అధికారులను దాడికి పంపారన్నారు. కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ ‘చారిత్రకం’ అని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గెగోంగ్ అపాంగ్ అన్నారు. మోడీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక రంగం కుదేలైందని తెదేపా జాతీ య అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నోట్ల ర ద్దుతో ప్రజలంతా నష్టపోయారని,దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. చెప్పగలరా? ప్రధా ని మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలి.. త్వరలోనే కుర్చీ దిగుతారు’ అని చంద్రబాబు వెల్లడించారు.