HomeNewsBreaking Newsమెగా కారు టెస్టు సెంటర్‌

మెగా కారు టెస్టు సెంటర్‌

హైదరాబాద్‌లో హ్యుందాయ్‌ యోచన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపిన హెచ్‌ఎంఐఇ టెక్స్‌టైల్‌ పార్కులో కొరియా పెట్టుబడులు

ప్రజాపక్షం / హైదరాబాద్‌
దక్షిణ కొరియా ఆటోమోటివ్‌ దిగ్గజం హ్యుందా మోటార్‌ కంపెనీ దాని భారతీయ విభాగమైన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఇ) ద్వారా తెలంగాణలో కారు మెగా టెస్ట్‌ సెంటర్‌ను స్థాపించాలని యోచిస్తోంది. మెగా టెస్ట్‌ సెంటర్‌లో ఆటోమేటివ్‌ టెస్ట్‌ ట్రాక్‌ సదుపాయంతో పాటు అత్యాధునిక టె కార్ల తయారీ సౌకర్యం (ఇవిలతో సహా) ఉం టుంది. అలాగే హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరిం గ్‌ కేంద్రం పునరుద్ధరణ, ఆధునీకరణ, విస్తరణ ద్వారా హెచ్‌ఎంఐఇ భారతదేశం సహా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో మరింత ఉపాధిని కల్పించనుంది. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యం గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సియోల్‌లో హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చల అనంతరం హెచ్‌ఎంఐఇ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్‌ అని, భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్‌ సెట్టింగ్‌ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అత్యాధునిక పరీక్షా సౌకర్యాల అభివృద్ధి చేసేందుకు తమకు అవకాశం కల్పించిన సిఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు హెచ్‌ఎంఐఇ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను తెలంగాణలో పెట్టించేందకు తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హెచ్‌ఎంఐఇ మెగా టెస్ట్‌ సెంటర్‌ సమీపంలోని సౌకర్యాలు ఇతర అనుబంధ సంస్థ లు, సరఫరాదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో కొరియా పెట్టుబడులుతెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్‌ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపుతో ఈ మేరకు కొరియా టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు గ్లోబల్‌ కంపెనీల అధినేతలు, బిజినెస్‌ గ్రూపులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్‌ రౌండ్‌ టేండ్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. టెక్స్‌టైల్‌ రంగం విస్తృత్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతోపాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని సిఎం తెలిపారు. వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. యంగాన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కియాక్‌ సంగ్‌ కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ సొయంగ్‌ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్‌ కంపెనీల అధినేతలు ఈ బిజినెస్‌ రౌండ్‌ టేండ్‌ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు.
దక్షిణ కొరియాలో సిఎం రేవంత్‌రెడ్డి పర్యటన శుభారంభం
దక్షిణ కొరియాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన శుభారంభమైంది. కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్‌ఎస్‌ గ్రూప్‌ చైర్మన్‌ కు-జాఉన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఎల్‌జి గ్రూప్‌ వ్యవస్థాపకులైన కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్‌ కేబుల్స్‌, బ్యాటరీల తయారీ, గ్యాస్‌, ఎనర్జీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్‌ఎస్‌ గ్రూప్‌ ఆసక్తి కనబర్చింది. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఎల్‌ఎస్‌ గ్రూప్‌ ఉన్నత స్థాయి బృందం త్వరలోనే తెలంగాణను సందర్శించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments