ప్రపంచంలోనే మూడవస్థానంలోకి..
దేశంలో కొత్తగా మరో 78,512 కేసులు
తాజాగా 971 మంది మృత్యువాత
36 లక్షలు దాటిన బాధితులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. నిత్యం 70 వేలకుపైగా కొత్తకేసులు, దాదాపు వెయ్యి మరణాలు నమోదవుతుండడం కలవర పెడుతుంది. ఇక రోజు వారీ కేసులు భారత్‌లోనే అత్యధికంగా వెలుగు చూ స్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కాగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 36 లక్షలు దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో మరోసారి 78,512 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 36,21,245కు చేరింది. ఒక్క రోజులో 75 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కావడం వరుసగా ఇది ఐదవరోజు. ఇక 24 గంట ల్లో 971 మందికి కరోనా కాటుకు బలయ్యారు. తాజా మృతులతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 64,469కి ఎగబాకింది. దీంతో మరణాల సంఖ్యలో ప్రపంచలోనే మూడవ స్థానంలో ఉన్న మెక్సికోను దాటి ఆ స్థానంలోకి భారత్ ఎగబాకింది. ఇప్పటి వరకు 27,74,804 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రికవరీ రేటు 76.62 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.78 శాతానికి పడిపోయిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,81,975 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌లో కొవిడ్ కేసులు 20 లక్షల నుంచి 30 లక్షలకు కేవలం 16 రోజుల్లోనే చేరుకోగా, 10 లక్షల నుంచి 20 లక్షల మార్క్‌ను దాటేందుకు 21 రోజులు పట్టింది. అయితే దేశంలో లక్ష కరోనా కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం తీసుకోగా, ఆ తరువాత కేవలం 59 రోజుల్లోనే పది లక్షలకు చేరాయి. ఆగస్టు 7న 20 లక్షలకు చేరుకోగా, 23వ తేదీ నాటికి 30 లక్షలు దాటాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా బ్రెజిల్, భారత్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతుండగా, మృతుల సంఖ్యలో కూడా భారత్ మూడవ స్థానంకి చేరింది. ఆదివారం దేశవ్యాప్తంగా 8,46,278 శాంపిళ్లకు కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 4,23,07,914 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు ఐసిఎంఆర్ పేర్కొంది.
మహారాష్ట్రలో కొనసాగుతున్న మరణ మృదంగం
మహారాష్ట్రలో నిత్యం కొత్తగా దాదాపు 15 వేల మందికి కరోనా పాజిటివ్ వస్తుండగా, 300 మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 296 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 24,399కు చేరింది. తమిళనాడులో కూడా నిత్యం వందకుపైగా మృతుల సంఖ్య నమోదవుతుంది. 24 గంటల్లో మరో 94 మందిని కరోనా బలితీసుకోగా, 7,231కి మృతుల సంఖ్య ఎగబాకింది. కర్నాటకలోనూ రోజుకు 100కుపైగా కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 106 మంది చనిపోగా, మృతుల సంఖ్య 5,589గా ఉంది. ఢిల్లీలో మృతుల సంఖ్య 4,426గా ఉండగా, కొత్తగా మరో 22 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 85 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతులు 3,969కి పెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం మృతులు 3,423 కాగా, కొత్తగా 67 మంది, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం మృతులు 3,176 కాగా, తాజాగా 50 మంది, గుజరాత్‌లో మొత్తం మృతులు 3,006 కాగా, కొత్తగా 17మంది, పంజాబ్‌లో మృతుల సంఖ్య 1,404 నమోదు కాగా, ఒక్క రోజులో 56 మంది, మధ్య ప్రదేశ్‌లో మృతుల సంఖ్య 1,374గా ఉండగా, కొత్తగా 29 మంది, రాజస్థాన్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,043 నమోదు కాగా, 24 గంటల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
దాదాపు 43 శాతం కేసులు మూడు రాష్ట్రాల నుంచే….
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. మొత్తం కేసుల్లో దాదాపు 43 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక నుంచే నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కేంద్రం నిత్యం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, మరణాల రెటు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది అని తెలుసుకునే పనిలో నిమగ్నమై ఉన్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో కొత్తగా 78,512 కేసులు నమోదు కాగా, ఈ కేసుల్లో దాదాపు 70 శాతం ఏడు రాష్ట్రాల నుంచే నమోదయ్యాయి. అందులో మహారాష్ట్రలోనే అత్యధికంగా 21 కొత్త కేసులు వెలుగు చూశాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 13.5శాతం, కర్నాటకలో 11.27 శాతం, తమిళనాడులో 8.27 శాతం రికార్డు అయ్యాయి. కాగా, మొత్తం కేసుల్లో 43 కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో నమోదైతే, గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 50 చోటు చేసుకున్నాయి.
మృతుల్లో మెక్సికోను దాటిన భారత్
RELATED ARTICLES