హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలకు సంబంధించిన వివరాలన్నీ సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదనే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలకూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని లక్షణాలు లేనప్పటికీ హైరిస్క్ అవకాశాలున్న వారికీ కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో చాలా తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని న్యాయస్థానం నిలదీసింది. కరోనా పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలకు ఎందరికి పరీక్షలు చేశారని.. రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో ఎందరు వైద్య సిబ్బందికి ఇచ్చారోతెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 4వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మృతదేహాల పరీక్షలు చేయండి
RELATED ARTICLES