సర్కార్‌ను నిలదీసిన సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
మూసీరివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ధర్నా
ఒక వరద నివారణ వ్యవస్థను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి, మూసీ నది తీర లోతట్టు ప్రాంతాలను కాపాడేందుకు ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎం.పి సయ్యిద్ అజీజ్ పాష మాట్లాడుతూ మూసీనది భారీ వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తూ వేలాది జనావాసాలు అతలాకుతలం చేస్తున్నా రాష్ర్ట ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీనది తీరప్రాంతాల్లో పర్యవేక్షణ కరువైందన్నారు. ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి చేయడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని విమర్శించారు. మూసీ తీర ప్రాంతాల్లో జలప్రళయం పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకొని, బస్తీలోకి వరద నీరు రాకుండా ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించే పనులు వెంటనే ప్రారంభించాలని అజీజ్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ మాట్లాడుతూ మూసీ నదిని పక్షాళన చేస్తామని మాటతప్పిన సిఎం కెసిఆర్.. నేడు సంభవించిన జలప్రళయంతో ఏర్పడిన కల్లోల పరిస్థితులు, నగర జీవనం అస్తవ్యస్తనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల జలదిగ్బంధంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని, చాల ప్రాంతాల్లో ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలు చేపట్టడంలేదని అయన విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని, మూసీనది ప్రక్షాళన, అభివద్ధి కోసం ఏర్పాటు చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు తగినన్ని నిధులు మంజూరు చేసి, వరదల నివారణకు మూసీ ఇరువైపులా రక్షణ గోడలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్ర చారి, రాష్ర్ట సమితి సభ్యులు ఆర్.శంకర్ నాయక్, ఎం.నరసింహ, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.ఎ. మన్నన్, ఎండి సలీం ఖాన్, టి.రాకేష్ సింగ్, టి.రాజేందర్ కుమార్, నిర్లేకంటి శ్రీకాంత్, ఎఐఎస్‌ఎఫ్ నేతలు బి.స్టాలిన్, ఆర్. ఎన్. శంకర్, నరేష్, శ్రీనివాస్, నాయకులు ఒమర్ ఖాన్, వీరేశం, శక్రి బాయి, వరద బాధితులు అక్రమ్, ఎండి గౌస్, షేక్ సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.
మూసీనది ప్రక్షాళన హామీ ఏమైంది?
RELATED ARTICLES