HomeNewsBreaking Newsమూఢనమ్మకాలకు వ్యతిరేకంగాచట్టాన్ని ఆమోదించాలి

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగాచట్టాన్ని ఆమోదించాలి

కూలాంతర వివాహం చేసుకున్న జంటకు రూ. లక్ష ఇవ్వాలి
జీవిత భాగస్వాములలో ఒకరు దళితులైతే రూ.2 లక్షలు, డబుల్‌ బెడ్‌రూమ్‌, ఉద్యోగాల్లో ఒకశాతం రిజర్వేషన్‌ కల్పించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రతిపాదన
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్‌

ప్రతి ఒక్కరూ డాక్టర్‌ బిఆర్‌ అం బేద్కర్‌ బోధనలను అనుసరించాలని సిపిఐ జాతీయ మాజీ ప్రధా న కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కుల నిర్మూలన అనేది అంబేద్కర్‌ బోధనలలో బలమైన అంశాలలో ఒకటని, కూలాంతర వివాహం చేసుకున్న జంటకు లక్ష రూపాయలు, జీవిత భాగస్వాములలో ఒకరు దళితులైతే రూ.2 లక్షలు, డబుల్‌ బెడ్‌రూమ్‌, ఉద్యోగాలలో ఒకశాతం రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేర కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సురవరం సుధాకర్‌రెడ్డి ఆదివారం లేఖను రాశారు. దేశంలోనే తొలిసారిగా డాక్టర్‌ అంబేద్కర్‌ పేరు తో సచివాలయాన్ని ఏర్పాటు చేసినందుకు సిఎం కెసిఆర్‌ను సురవరం సుధాకర్‌రెడ్డి హృదయపూర్వకంగా అభినందించారు. రాష్ట్ర సచివాలయం ముందు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అతిపెద్ద విగ్రహాన్ని జ్ఞాన విగ్రహంగా ప్రతిష్టించడం హర్షణీయమన్నారు. కుల నిర్మూలనపై డాక్టర్‌ అంబేద్కర్‌ ఒక ప్రసిద్ధ పుస్తకాన్ని రచించారని, దీనిని సాధించేందుకు ఆయన తన జీవితాంతం ఎంతో ఆదరించారనే గుర్తు చేశా రు. అంబేద్కర్‌ జీవితకాల లక్ష్యాలలో ఒకటైన ప్రతి కులానికి చెందిన కార్యాలయానికి భూమి, డబ్బు ఇస్తున్నారని, పేద వారి పిల్లల పెళ్లికి కూడా డబ్బు లు ఇచ్చారని, కానీ కులాంతర వివాహాలు చేసుకున్న వారికి సిఎం కెసిఆర్‌ ఎలాంటి ఆర్థిక సహాయమూ ప్రకటించలేదన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలోని కొన్ని గ్రామాలలో మూఢనమ్మకాలు కొనసాగుతున్న విష యం తెలిసిందేనని, దీనికి వ్యతిరేకంగా చట్టాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఎస్‌సి, బిసి వర్గాలకు చెందిన కొందరు మహిళలు లేదా పురుషులపై ఆరోపణలు చేస్తూ చిత్ర హింసలకు గురిచేసి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మంద మనస్త త్వం కారణంగా బాణామతి పేరుతో హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. నేరం చేసిన వారిని,ప్రోత్సహించిన వారిని నిరోధించేందు కు, శిక్షించేందుకు మనకు చట్టం అవసరమని, నిజాం కాలంలో పోలీసుశాఖ కింద బాణామతి, చిల్లంగిపై ప్రత్యేక విభాగం ఉండేదని సురవరం గుర్తు చేశారు. తమిళనాడు తరహా కూర్చునే హక్కు చట్టం తీసుకురావాలని సూచించారు. ట్రాఫిక్‌ పోలీసులు, ప్రైవేట్‌ సెక్యూరిటీ, హాస్పిటల్‌ సిబ్బంది, ప్రభుత్వ కార్యాలయాల్లోని నాలుగో తరగతి ఉద్యోగులు, షాపుల్లో సేల్స్‌ సిబ్బంది, లిఫ్ట్‌ సిబ్బంది, డ్రైవర్లు ఇలా లక్షలాది మంది దాదాపు పది నుంచి పన్నెండు గంటల పాటు నిలుచుంటున్నారని తెలిపారు. ఎక్కువ గంటలు నిలబడడం వల్ల కాళ్ల నుంచి గుండెకు రక్తప్రసరణ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారని, గుండెపోటు, పక్షవాతం స్ట్రోక్‌ తదితర వైద్య సమస్యలకు కారణం కావచ్చని ఆయన తెలిపారు. ‘కూర్చునే హక్కు’ అనేది మానవ హక్కు అని, ప్రతి ఒక్కరి జీవితానికి గౌరవాన్ని తెస్తుందని, దయచేసి మానవతా కోణంలో ఆలోచించి, కూర్చునే హక్కును కల్పించేలా ఒక చట్టాన్ని అమలు చేయడానికి సానుకూలంగా స్పందించాలని కోరారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రాసిన కొన్ని పుస్తకాలు ఇప్పటికే తెలుగులోకి అనువదించబడ్డాయని, అన్ని పుస్తకాలను అనువదించేలా ప్రభుత్వం చొరవ తీసుకుని, ఆ పుస్తకాలను విస్తృతంగా అందుబాటులో ఉండేలా ఈ పుస్తకాలకు సబ్సిడీకి ఇవ్వాలి సూచించారు. తాను ప్రస్తావించిన అంశాలపై ప్రభుత్వ సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తానని సురవరం సుధాకర్‌ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments