ఫిడే తాజా ర్యాంకింగ్స్ విడుదల
న్యూ ఢిల్లీ: ఇండియా చెస్ ప్లేయర్ కోనేరు హంపి ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. కుమార్తె అహ్నను చూ సుకొనేందుకు రెండేళ్లు ఆట నుంచి విరామం తీసుకున్న ఈ తెలుగు వనిత రష్యాలో ఈ మధ్యే నిర్వహించిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రి విజేతగా నిలిచింది. ఘనంగా పునరాగమనం చేసింది. ఈ విజయంతో ఆమె ఖాతాలో 17ఎలో పాయింట్లు పెరిగాయి. మొత్తం 2,577 రేటింగ్ పాయింట్లతో ఆమె మూడో స్థానంలో నిలిచింది. చైనీస్ అమ్మాయిలు హోయు యిఫ్యాన్ (2,659 పాయింట్లు), జు వెన్‌జున్ (2,586 పాయింట్లు) తొలి రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఇక ఓపెన్ విభాగంలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 2,765 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుత ప్రపంచ విజేత, నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ 2,876 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మూడో స్థానంలో హంపి
RELATED ARTICLES