తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో పాక్ చిత్తు
సెంచూరియన్: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు లో సౌతాఫ్రికా 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగి న సఫారీ జట్టు 50.4 ఓవర్లలో 4 వికెట్లు కో ల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎల్గర్ (50), హాషి మ్ ఆమ్లా (63 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించడంతో సౌతాఫ్రికా మూడో రోజే గొప్ప విజయాన్ని అందుకుంది. అయితే బౌలర్ల జోరు కొనసాగిన ఈ టెస్టులో సౌతాఫ్రికా బౌలర్ ఒలివర్ రెండు ఇన్నింగ్స్‌లలో 11 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన ఒలివర్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి పాక్‌ను చిత్తు చేశాడు. ఇతని ధాటికి పాకిస్థాన్ రెండు ఇ న్నింగ్స్‌లలో 181, 190 పరుగులకు ఆలౌటైంది. విజయంలో కీలక పాత్ర పోషించిన ఒలివర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా 1 ఆధిక్యం సాధించింది. ఇక రెండో టెస్టు జనవరి 3న కెప్టెన్ వేదికగా జరగనుంది. శుక్రవారం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మార్కరమ్ (0) పరుగులేమి చేయకుండానే హసన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో సఫారీ జట్టు పరుగుల ఖాతా తెరువకుండానే మొదటి వికెట్ చేజార్చుకుంది. తర్వాత హాషిమ్ ఆమ్లా, డీన్ ఎల్గర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో సఫారీ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. సింగిల్స్, డబుల్స్‌తో పాటూ అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీ లు బాదుతూ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 50 పరుగుల మార్కు ను పూర్తి చేసుకుంది. ఒకవైపు ఎల్గర్ కుదురుగా ఆడుతుంటే.. మరోవైపు ఆమ్లా మాత్రం వేగంగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్ర మంలోనే దూకుడుగా ఆడుతున్న ఆమ్లా 88 బం తుల్లో 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మరోవైపు వీరు రెండో వికెట్‌కు 199 బం తుల్లో కీలకమైన 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుని తమ జట్టును విజయానికి చెరువచేశారు. ఈ జంటను విడదీయడానికి పాక్ బౌలర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే సమన్వయంతో ఆడుతు న్న ఎల్గర్ 122 బంతుల్లో 10 ఫోర్ల సహకారంతో అర్ధ శతకం సాధించాడు. ఆ తర్వాతి బంతికే మసూద్ తెలివైన బంతితో ఎల్గర్ (50)ను పెవిలియన్ పంపాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలకమైన 119 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి త మ జట్టును గెలుపు ముంగిట్లో నిలిపారు. తర్వాత వచ్చిన డి బ్రూన్ (10), కెప్టెన్ డు ప్లెసీస్ (0) పరుగులకే ఔటవ్వడంతో సౌతాఫ్రికా 137 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. తర్వాత మిగిలిన స్వల్ప లక్ష్యాన్ని బవుమా (10 బంతుల్లో 13 నాటౌట్)తో కలిసి హాషిమ్ ఆమ్లా (63 నాటౌట్; 148 బంతుల్లో 11 ఫోర్లు) పూర్తి చేశాడు. సౌతాఫ్రికా 50.4 ఓవర్లలో 151/4 పరుగులు చేసి 6 వికెట్లతో చిరస్మరణీయ విజయం సాధించింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ, షహీన్ అప్రిది, యాసిర్ షా, షాన్ మసూద్ చెరోక్క వికెట్ తీశారు.
మూడో రోజే ముగించారు
RELATED ARTICLES