14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో…
బరిలో రాహుల్ గాంధీ, అమిత్ షా తదితర ప్రముఖులు
న్యూఢిల్లీ: లోక్‌సభకు అతిపెద్ద మూడో విడత ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఇందు కు రంగం సిద్ధమైంది. గుజరాత్, కేరళలోని అన్ని నియోజకవర్గాలు సహా దేశవ్యాప్తంగా 14 రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లో 26, కేరళలో 20, అసోంలో 4, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 7, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమబెంగాల్‌లో 5, గోవాలో 2, దాద్రనాగర్‌హవేలీలో 1, డయ్యూ డామన్‌లో 1, త్రిపురలో 1 సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఏప్రిల్ 18నే జరగాల్సి ఎన్నికను ఇప్పుడు మూడో దశలో నిర్వహిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనుండగా అందులో భాగం గా మూడో విడత ఎన్నికల్లో అనంత్‌నాగ్ లోక్‌సభ సీటుకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత ఎన్నికల్లో ఓటేయడానికి 18.56 కోట్ల మంది ఓటర్లు అర్హులు. ఎన్నికల సంఘం మూడో విడత ఎన్నికలకు 2.10 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసింది. అంతేకాక అనేక భద్రత ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 11న మొదటి విడత ఎన్నికల్లో 91 లోక్‌సభ స్థానాలకు, ఏప్రిల్ 18న రెండో విడత ఎన్నికల్లో 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
మూడో దశ పోలింగ్ నేడే
RELATED ARTICLES