న్యూఢిల్లీ: భారత నిరుద్యోగ రేటు అక్టోబర్ నెలలో 8.5 శాతం పెరిగింది. ఇది మూడేళ్లలో అత్యధికం. 2016 ఆగస్టు నుంచి పెరిగిన అత్యధిక నిరుద్యోగం రేటు ఇదేనని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ(సిఎంఐఇ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఓవైపు ప్రభుత్వం డిమాండ్‌ను పెంచే చర్యలను ప్రకటిస్తున్నప్పటికీ ఉద్యోగకల్పనలో మందగమనం కొనసాగుతోంది. అయితే ఇది దేశ ఆర్థిక మందగమనం కారణంగానేనని భావిస్తున్నారు. దేశంలో మౌలికవసతుల ఉత్పత్తి ఇయర్ ఆన్ ఇయర్ ఆధారంగా సెప్టెంబర్‌లో 5.2 శాతంకు కుంచించుకుపోయా యి. ఉత్పత్తి బాగా తగ్గిపోయిన ఎనిమిది ప్రధాన పరిశ్రమల్లో మౌలికవసతుల పరిశ్రమ ఒకటి. ఎనిమిది ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి సెప్టెంబర్‌లో చాలా అధ్వానంగా ఉం ది. దేశంలో 2011 నుంచి 2017 మధ్యన మొత్తం ఉద్యోగ కల్పన గణనీయంగా తగ్గిపోయిందని సెంటర్ ఫర్ సస్టయినబుల్ ఎంప్లాయ్‌మెంట్ విడుదల చేసిన తన తాజా అకాడమిక్ రిసెర్చ్ పేపర్‌లో పేర్కొందని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తెలిపింది.
మూడేళ్లలో గరిష్ఠంగా పెరిగిన నిరుద్యోగం
RELATED ARTICLES