ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గురువా రం ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి దిగువ స్థాయిలో పవనాలు వీస్తున్నాయని తెలిపింది. మంగళవారం ఉత్తర బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం బలహీనపడిందని, ఉపరితల ధ్రోణి నైరుతి, ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని వివరించింది.
మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
RELATED ARTICLES