ఉపసంహరణ బిల్లుకు ఎపి అసెంబ్లీ ఆమోదం
అమరావతి: మూడు రాజధానులకు అవకాశం కల్పిస్తూ గతంలో ఆమోదించిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబందించిన రాజధానుల ఉపసంహరణ బిల్లును సోమవారం ప్రవేశపెట్టినప్పుడు ఎపి అసెంబ్లీ ఆమోదించింది. అమరావతితోపాటు కర్నూలు, విశాఖపట్నంలో రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. త్వరలోనే సమగ్రమైన, పూర్తి వికేంద్రీకరణ బిల్లును తెస్తామని ఆయన ప్రకటించారు. అనంతరం సభ మంగళవారం నాటికి వాయిదా పడింది. అంతకు ముందు ఆర్థిఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో మూడు రాజధానుల చట్ట ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టగా, స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించారు. ఈ బిల్లుపై చర్చ జరిగింది. మంత్రి రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని వ్యాఖ్యానించారు. అమరాతిని రాజధానిగా ప్రకటించడం శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలకు విరుద్ధమని అన్నారు. కోస్తాను వెనుకబడిన ప్రాంతంగా ఆ కమిటీ ఎక్కడా పేర్కోలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కేవలం ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందితే తప్పనిసరిగా వేర్పాటు వాదాలు మొదలవుతాయని వ్యాఖ్యానించారు. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని, అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల బిల్లును అప్పట్లో ప్రవేశపెట్టామని అన్నారు. అమరావతి పట్ల తనకు వ్యతిరేక లేదన్నారు. అయితే, అధికార, అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అమరావతి అభివృద్ధిపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుది ఊహాజనితమైన కల్పన మాత్రమేనని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు వికేంద్రీకరణకే మొగ్గు చూపాయని అన్నారు. ్ద
మూడు రాజధానుల చట్టం రదు
RELATED ARTICLES