మూడు టి20ల మ్యాచ్‌లలో భారత్ నుంచి నలుగురు క్రికెటర్లు
మార్చి 12 నుంచి ప్రారంభం
ముంబయి : బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మన్ 100వ జయంతి వేడుకల సందర్భంగా బంగ్లాదేశ్ గడ్డపై మార్చి 18, 21న ఆసియా ఎలెవన్, వరల్ ఎలెవన్ మధ్య రెండు టి20 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ఆసియా ఎలెవన్ జట్టులో పాకిస్థాన్ మినహా మిగిలిన ఆసియా దేశాల క్రికెటర్లు ఆడతారు. మరోవైపు వరల్డ్ ఎలెవన్ జట్టులో మిగిలిన దేశాల క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆసియా ఎలెవన్ జట్టు కోసం భారత్ నుంచి నలుగురు క్రికెటర్లని పంపాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌లు ఆసియా ఎలెవన్‌లో ఆడనున్నట్టు సమాచారం.
బిసిసిఐ గ్రీన్ సిగ్నల్..
బిసిసిఐకి చెందిన ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం… ఆసియా ఎలెవన్ తరఫున జరిగే రెండు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్‌లు ఆడేందుకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆమోదించారట. ఆసియా ఎలెవన్ జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించనున్నారట. ఆటగాళ్ల షెడ్యూల్‌ని పరిశీలించాకే బంగ్లాదేశ్ బోర్డుకు దాదా సమాచారం తెలిపారట. ‘బిసిబి’కి గంగూలీ ఆటగాళ్ల జాబితా పంపించారు. ఆసియా ఎలెవన్ జట్టుకు కోహ్లీ, ధావన్, షమీ, కుల్‌దీప్ ప్రాతినిధ్యం వహించనున్నారు’ అని బిసిసిఐ సంబంధిత అధికారి ఒకరు ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, ఆసియా ఎలెవన్ జట్టులో పాకిస్థాన్ ప్లేయర్లు కూడా ఉంటారని, భారత ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన బిసిసిఐ సంయుక్త కార్యదర్శి జయేష్ జార్జ్ ఈ మ్యాచ్‌ల్లో పాక్ ఆటగాళ్లు ఉండరని స్పష్టం చేశాడు. దీంతో బిసిసిఐ తమ క్రికెటర్లను పంపనుంది. మరోవైపు తమ ప్లేయర్స్ పాక్ సూపర్ లీగ్‌లో బిజీగా ఉండడంతోనే పంపలేకపోతున్నామని పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
చివరి వన్డేకు దూరం..
షేక్ మజీబుర్ రహ్మన్ వందో జయంతి వేడుకల సందర్భంగా ఈ టి20 సిరీస్‌ని నిర్వహించబోతున్నట్లు గత ఏడాది బంగ్లాదేశ్ ప్రకటించింది. ఐసిసి అనుమతిని బిసిబి కోరగా.. అధికారికంగా టి20 హోదాని ఇచ్చింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మార్చి 12 నుంచి 18 వరకూ మూడు వన్డే సిరీస్ జరగనుంది. దాదా నిర్ణయంతో సఫారీలతో జరిగే చివరి వన్డేకు ఈ నలుగురు క్రికెటర్లు (కోహ్లీ, ధావన్, షమీ, కుల్‌దీప్) దూరం కానున్నారు.
ముజీబుర్ సిరీస్‌కు ఐసిసి ఓకె
RELATED ARTICLES