ముంబయి: ఐపిఎల్ 2023 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ మరో విజయాన్నందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెకెఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 104) సెంచరీతో చెలరేగగా.. ఆండ్రీ రస్సెల్ (11 బంతుల్లో 3 ఫోర్లు వికెట్‌తో 21 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, డాన్ జాన్సెన్, పియూష్ చావ్లా, రీలే మెరిడిత్ తలో వికెట్ తీసారు. లక్ష్యచేధనకు దిగిన ముంబయి ఇండియన్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), తిలక్ వర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30) విలువైన పరుగులు చేశారు. కెకెఆర్ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. లూకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. ముంబయి ఇండియన్స్‌కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(20) అదరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇషాన్ కిషన్ బౌండరీలతో విరుచుకుపడటంతో 4 ఓవర్లలోనే 57 పరుగులు చేసింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సుయాశ్ శర్మ విడదీసాడు. రోహిత్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో తొలి వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఔటైనా.. సూర్యతో కలిసి ఇషాన్ చెలరేగడంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. సుయాశ్ శర్మ వేసిన ఏడో ఓవర్‌లో బౌండరీ బాదిన ఇషాన్ కిషన్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చక్రవర్తీ మరుసటి ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ తన ఫామ్‌ను కొనసాగించాడు. తనదైన షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఆరంభంలో కాస్త తడబడినా.. లయలోకి వచ్చిన సూర్య కూడా బౌండరీలు బాదాడు. ఫెర్గూసన్ వేసిన 11వ ఓవర్‌లో సూర్య వరుసగా రెండు సిక్స్‌లు బాది ఫామ్ అందుకున్నాడు. పరుగులతో విజయం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని సుయాశ్ విడదీసాడు. తిలక్ వర్మ(30)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తిలక్ ఔటైనా.. టీమ్ డేవిడ్‌తో కలిసి సూర్య చెలరేగాడు. అయితే అతని ఇన్నింగ్స్‌కు శార్దూల్ ఠాకూర్ బ్రేక్ వేసాడు. కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన నెహాల్ వదేరా(6) విఫలమైనా.. కామెరూన్ గ్రీన్(1)తో కలిసి టీమ్ డేవి్‌డ13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ముంబయి ఇండియన్స్‌ఘనవిజయం
RELATED ARTICLES