నిర్మలాసీతారామన్ కౌంటర్
పుణె: ఆర్‌బిఐ నుంచి ప్రభుత్వం నిధులు దోపిడి చేసిందని రాహుల్ గాంధీ అనడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. విపక్ష నాయకుడి ఆరోపణలను తాను పెద్దగా పట్టించుకోబోనని అన్నారు. అయితే రాహుల్ గాంధీ ‘ఆర్‌బిఐ దోపిడి అంటూ ఆరోపణలు చేసే ముందు రాహుల్ గాంధీ తన పార్టీకి చెందిన ఆర్థిక మంత్రులను, సీనియర్లను సంప్రదించి ఉంటే బాగుండేది. రాహుల్ గాంధీ దోపిడీ అంటున్నారు. నేను ఆ పదాన్ని వాడను. కాంగ్రెస్ చోర్(దొంగ) అనే ట్యాగ్ వద్దే ఆగిపోయింది. ఆ పదాన్ని వాడటంలో వారు నిపుణులు. కానీ ఆర్‌బిఐ ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని నేను కాంగ్రెస్‌ను కోరుతున్నాను. ఆర్‌బిఐ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీని కాంగ్రెస్ ప్రశ్నించడం బాధిస్తోంది. రాహుల్ గాంధీ ‘చోర్, చోరి’ వంటి పదాలు వాడినప్పుడు నాకో విషయం గుర్తుకు వస్తుంది. ఆయన ఆ పదాలను బాగానే వాడినప్పటికీ ప్రజలు మాత్రం గట్టి సమాధానం ఇచ్చారు. మళ్లీ ఎందుకు ఆ పదాలనే వాడుతున్నారు?’ అని ఆమె విరుచుకుపడ్డారు. ఆ నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంగళవారం నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ‘ఆ నిధుల వినియోగంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరవాత వివరిస్తాం’ అని పుణెలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. బిమల్ జలాన్ కమిటీని ఏర్పాటు చేసేప్పుడు మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అరవింద్ సుబ్రమణ్యన్ ‘ఆర్‌బిఐ డబ్బును బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ వంటి ప్రత్యేక అవసరాలకే వినియోగించాలి’ అని సూచించారు. ఆర్‌బిఐ అదనపు మూలధనం అంశంపైనే విభేదించి ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ డిసెంబర్‌లో, డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య గత నెల రాజీనామాలు చేశారు. వారు ఆర్‌బిఐ బ్యాలెన్స్ షీటుపై ప్రభుత్వం పెత్తం చెలాయిస్తోందంటూ విమర్శించారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా తర్వాత గవర్నర్ శక్తికాంత దాస్ జలాన్ కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ కమిటీ నిర్ణయం మేరకు ఇప్పుడు ఆర్‌బిఐ అదనపు నిధులు ప్రభుత్వానికి బదిలీ కాబోతున్నాయి.
మీ ఆర్థిక మంత్రులను అడిగి మాట్లాడండి!
RELATED ARTICLES